Pawan Kalyan – OG : పవన్ OG సినిమా కోసం ఆ హీరోని తీసుకొచ్చిన సుజీత్.. పవన్ ఫ్యాన్స్ కి అప్డేట్ ఇచ్చిన తమన్..

తాజాగా OG సినిమా వార్తలకు తమన్ క్లారిటీ ఇచ్చాడు.

Music Director Gives Clarity on Tamil Hero Simbu for OG Movie

Pawan Kalyan – OG : పవన్ కళ్యాణ్ OG సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. పవన్ రెండు వారాల డేట్స్ ఇస్తే షూటింగ్ అయిపోతుందని మూవీ యూనిట్ అంటుంది. పవన్ ఏపీ ప్రభుత్వంలో బిజీగా ఉండటంతో వాటికి డేట్స్ ఇవ్వడం ఆలస్యం అవుతూ వస్తుంది. ఇప్పటికే OG నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై బోలెడంత హైప్ ఇచ్చారు.

Also Read : Megastar Chiranjeevi : మెగాస్టార్‌కి అరుదైన గౌర‌వం.. గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ లో చిరంజీవి పేరు..

పవన్ డేట్స్ ఇచ్చే లోపు సినిమాకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేసేస్తున్నారు డైరెక్టర్ సుజీత్. అయితే కొన్ని రోజుల క్రితం OG సినిమాలో తమిళ్ స్టార్ శింబు ఓ పాట పాడబోతున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలకు తమన్ క్లారిటీ ఇచ్చాడు. సుజీత్, తమన్, హీరో శింబు కలిసి దిగిన ఫోటో షేర్ చేసి.. మీకు తెలుసు, మాస్ ర్యాంపేజ్ త్వరలో రాబోతుంది అని పోస్ట్ చేసాడు. దీంతో తమన్ పోస్ట్ వైరల్ గా మారింది.

ఈ పోస్ట్ తో పవన్ OG సినిమాలో శింబు సాంగ్ పడుతున్నాడని క్లారిటీ వచ్చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమిళ్ హీరో శింబు సింగర్ అని కూడా తెలిసిందే. ఇప్పటికే తెలుగు, తమిళ్ తో పాటు వేరే భాషల్లో కూడా అనేక సాంగ్స్ పాడాడు. గతంలో తెలుగులో ఎన్టీఆర్, మంచు మనోజ్, నిఖిల్, రామ్.. హీరోలకు శింబు పాటలు పాడాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి పాట పాడబోతున్నాడు శింబు.