Music Director Koti
Music Director Koti : కొన్నేళ్ల క్రితం వరకు వచ్చిన పాటలు ఇప్పటికీ వింటూనే ఉంటాము. ముఖ్యంగా 80s, 90s లలో వచ్చిన పాటలు ఎన్నేళ్లయినా వింటూనే ఉంటాము. కానీ ఇప్పుడొచ్చే పాటల జీవితకాలం చాలా తక్కువ. సినిమా రిలీజయి వెళ్లిపోయిన కొన్నాళ్ళకు పాటలు కూడా మర్చిపోతున్నాము. అలాగే ఇటీవల కాలంలో మెలోడీ పాటలు, మంచి సాహిత్యం ఉన్న పాటలు చాలా అరుదుగా వస్తున్నాయి.(Music Director Koti)
తాజాగా సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఇప్పటి పాటలు గురించి, మ్యూజిక్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Also Read : Music Director Koti : మ్యూజిక్ కాపీ కొట్టాము అంటున్నారు.. అయితే ఏంటి..? కోటి వ్యాఖ్యలు వైరల్..
మ్యూజిక్ డైరెక్టర్ కోటి మాట్లాడుతూ.. ఇప్పటి పాటలు ఎక్కువ రోజులు గుర్తుండట్లేదు. సౌండ్ రోత పుట్టించకూడదు. ఇప్పుడు అదే మిస్టేక్ జరుగుతుంది. పిచ్చి పిచ్చి పాటలు, అరుపులు, కేకలు తో పాటలు ఉంటున్నాయి. దయ్యాలు అరిచినట్టే పాటలు ఉంటున్నాయి. ఇంగ్లీష్ సాంగ్స్ వినేసి అలాగే చేసేస్తున్నారు. ఓ మ్యూజిక్ ని కొట్టేస్తున్నారు. అన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కారణం మ్యూజిక్. మ్యూజిక్ వల్ల కూడా ఇటీవల చాలా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. ఒక్క పాట బాగున్నా చాలు సినిమా హిట్ అవ్వడానికి.
మెలోడీ పాటలు రావట్లేదు అసలు ఇటీవల. రోత పుట్టే మ్యూజిక్ నేను యాక్సెప్ట్ చేయలేను. వచ్చే రోజుల్లో మ్యూజిక్ లేకుండా వస్తారు. తమన్ తర్వాత చేసే వాళ్ళు లేరు. మా పాత పాటలే మళ్ళీ ఇటీవల రీమిక్స్ చేసి వాడుతున్నారు. ఛాలెంజ్ చేస్తున్నాను మళ్ళీ అలంటి గొప్ప పాటలు ఎవరూ చేయలేరు. నేను గర్వంగా చెప్పట్లేదు. అంత కష్టపడి అంత మంచి పాటలు ఇచ్చి ప్రూవ్ చేసుకున్నాం. పాటలకు వాల్యూమ్ ఒక లిమిట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ సౌండ్ ని ఫుల్ గా పెంచేస్తున్నారు అంటూ ఇప్పటి పాటలపై సంచలన వ్యాఖ్యలు చేసారు.
Also See : Saanve Megghana : ‘అనగనగా ఒక రాజు’లో ఐటెం సాంగ్ చేసింది ఈ హీరోయినే.. సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫొటోలు..