Music Director Koti : మ్యూజిక్ కాపీ కొట్టాము అంటున్నారు.. అయితే ఏంటి..? కోటి వ్యాఖ్యలు వైరల్..
దీనిపై తాజాగా సీనియర్ సంగీత దర్శకులు కోటి స్పందించారు.(Music Director Koti)
Music Director Koti
- మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఇంటర్వ్యూ
- మ్యూజిక్ కాపీయింగ్ పై కామెంట్స్
- కాపీ కాదు ఇన్‌స్పిరేషన్ అంటూ
Music Director Koti : ఇటీవల చాలా మంది సంగీత దర్శకులు మ్యూజిక్ ని కాపీ కొడుతున్నారని విమర్శలు ఎదుర్కుంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా, ఓటీటీ, ప్రపంచ సంగీతం అంతా నెట్ లో దొరికేస్తుండటంతో ఏ కొత్త పాట, సినిమా వచ్చినా ఈ మ్యూజిక్ ఎక్కడన్నా కాపీ కొట్టారా అని వెతికేస్తున్నారు కొంతమంది. ఆ మ్యూజిక్ లో కొంత వేరే మ్యూజిక్ ఆల్బమ్ తో కలిసినా, అటు ఇటుగా మార్చి ఇచ్చినా కాపీ కొట్టారు అని కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే కొంతమంది అదే పని మీద ఉన్నారు.(Music Director Koti)
ఇలాంటి కాపీ కామెంట్స్ ఇటీవల సంగీత దర్శకులు ఎక్కువగా ఎదుర్కుంటున్నారు. దీనిపై తాజాగా సీనియర్ సంగీత దర్శకులు కోటి స్పందించారు.
Also See : Saanve Megghana : ‘అనగనగా ఒక రాజు’లో ఐటెం సాంగ్ చేసింది ఈ హీరోయినే.. సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫొటోలు..
కోటి మాట్లాడుతూ.. మేము చాలా సార్లు వేరే సాంగ్స్ ని ఇన్‌స్పిరేషన్ గా తీసుకున్నాం. కొన్ని ఇంగ్లీష్ సాంగ్స్, హిందీ సాంగ్స్ ఇన్‌స్పిరేషన్ తీసుకున్నాం. అంతే కానీ అది కాపీ కొట్టం. అలా అని మేమే క్రియేట్ చేశామని చెప్పుకోము. ఇన్‌స్పిరేషన్ తీసుకొనే దాన్నుంచి కొత్తగా మ్యూజిక్ క్తియేట్ చేస్తాము. పాట చక్కగా రావడానికి ఇన్‌స్పిరేషన్ తీసుకుంటాం.
కొంతమంది కాపీ కొట్టారు, మ్యూజిక్ కొట్టేసారు అని అంటారు. పాటల కింద ఈ మ్యూజిక్ ఎక్కడ్నుంచో కొట్టేసారు అని కామెంట్స్ చేస్తారు. కాపీ కొట్టాము, అయితే ఏంటి. నువ్వేదో ఐన్ స్టీన్ లాగ చెప్పడం ఎందుకు. ఇన్‌స్పిరేషన్ లేకుండా చేయలేము. అలా అని అన్ని ఇన్‌స్పిరేషన్ తీసుకోము. కొన్ని సార్లు చేస్తాము. అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్‌స్పిరేషన్ తీసుకొని చేస్తారు. నాకంటే సీనియర్లు కూడా చాలా మంది అలా చేసినవాళ్ళే. కాపీ కొట్టేసి అది అలాగే వదిలేస్తే కరెక్ట్ కాదు. ఆ మ్యూజిక్ ని మన జనాలకు, మన నేటివిటీకి తగ్గట్టు మార్చాలి అని అన్నారు. దీంతో కోటి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read : Koti : పవన్ కళ్యాణ్ విషయంలో ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతాను.. కోటి ఆసక్తికర వ్యాఖ్యలు..
