Koti : పవన్ కళ్యాణ్ విషయంలో ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతాను.. కోటి ఆసక్తికర వ్యాఖ్యలు..

తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ కోటి 10 టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.(Koti)

Koti : పవన్ కళ్యాణ్ విషయంలో ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతాను.. కోటి ఆసక్తికర వ్యాఖ్యలు..

Music Director Koti

Updated On : January 18, 2026 / 5:46 PM IST
  • మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఇంటర్వ్యూ
  • పవన్ కళ్యాణ్ పై కామెంట్స్
  • రిగ్రెట్ ఫీల్ అవుతాను అంటూ

Koti : ఒకప్పుడు తమ సంగీతంతో, పాటలతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలాడించారు సంగీత ద్వయం రాజ్ – కోటి. ఆ తర్వాత కొన్నాళ్ళకు కోటి సింగిల్ గానే సంగీత దర్శకుడిగా అనేక సినిమాలకు మ్యూజిక్ ఇచ్చారు. 90s లో ఆల్మోస్ట్ చాలా సినిమాలకు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోటి అందించినవే.(Koti)

తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ కోటి 10 టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో కోటి అనేక ఆసక్తికర విషయాలు తెలిపారు. పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Also See : Dimple Hayathi : రవితేజ థియేటర్ లో డింపుల్ హయతి సందడి.. క్యూట్ ఫొటోలు వైరల్..

కోటి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు నేను ఫుల్ ఫామ్ లో ఉన్నాను అప్పుడు. ఫామ్ లో ఉన్నప్పుడు ఎవరూ మనకు సజెషన్స్ ఇవ్వరు. నాకు ఇప్పటికీ ఒక చిన్న రిగ్రెట్ ఉంది. పవన్ కళ్యాణ్ కి మంచి మ్యూజిక్, సాంగ్స్ ఇవ్వలేకపోయాను అని ఉంది. పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, గోకులంలో సీత సినిమాలకు నేను పనిచేసాను. అప్పుడు డైరెక్టర్స్ EVV సత్యనారాయణ, ముత్యాల సుబ్బయ్య వారి పంథాలోనే మ్యూజిక్ అడుగుతారు. ఆ సినిమాల డైరెక్టర్స్ వల్లే పవన్ కి మంచి మ్యూజిక్ ఇవ్వలేదు అనిపించింది.

తర్వాత పవన్ తనంతట తానే మ్యూజిక్ డైరెక్టర్స్ ని తెచ్చుకున్నాడు. ఒక కొత్త స్టైల్ తెచ్చాడు. చాలా మంది కొత్తవాళ్లను పరిచయం చేసాడు. పవన్ కి స్పెషల్ గా కావాలి మ్యూజిక్. అది నేను చేయలేకపోయాను. ఇప్పుడు పవన్ తో ఛాన్స్ వస్తే కుమ్మేస్తాను. పవన్ తో ఛాన్స్ కోసం వెయిటింగ్. ఆయన లెవల్ కి తగ్గకుండా ఇస్తాను. ఫ్యాన్స్ ని మళ్ళీ ఉర్రూతలాడిస్తాను అని తెలిపారు. పవన్ చాలా రేర్ గా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడున్న యువ సంగీత దర్శకులతో పోటీ పడి మ్యూజిక్ డైరెక్టర్ కోటి పవన్ సినిమాకు ఛాన్స్ సంపాదించగలరా చూడాలి.

Also Read : Rithu Chowdary : నన్ను భరిస్తాడు అంటూ.. డిమాన్ పవన్ తో రిలేషన్ గురించి చెప్పిన రీతూ చౌదరి..