Rithu Chowdary : నన్ను భరిస్తాడు అంటూ.. డిమాన్ పవన్ తో రిలేషన్ గురించి చెప్పిన రీతూ చౌదరి..

తాజాగా రీతూ చౌదరి ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డిమాన్ పవన్ గురించి మాట్లాడింది.

Rithu Chowdary : నన్ను భరిస్తాడు అంటూ.. డిమాన్ పవన్ తో రిలేషన్ గురించి చెప్పిన రీతూ చౌదరి..

Rithu Chowdary

Updated On : January 18, 2026 / 4:21 PM IST
  • బిగ్ బాస్ ఫేమ్ రీతూ చౌదరి
  • రీతూ చౌదరి ఇంటర్వ్యూ
  • డిమాన్ పవన్ తో అనుబంధం గురించి

Rithu Chowdary : ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో రీతూ చౌదరి – డిమాన్ పవన్ జంట బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. హౌస్ లో వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా నడిచింది. వీరిద్దరూ హౌస్ లో బాగా క్లోజ్ అయ్యారు. ఈ బిగ్ బాస్ జంట BB జోడి డ్యాన్స్ షోకి కూడా వచ్చి హాట్ హాట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో రెచ్చిపోతున్నారు.(Rithu Chowdary )

తాజాగా రీతూ చౌదరి ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డిమాన్ పవన్ గురించి మాట్లాడింది.

Also Read : Bramarambika Tutika : నటి భ్రమరాంబిక బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..

రీతూ చౌదరి మాట్లాడుతూ.. డిమాన్ పవన్, నేను ఫస్ట్ వీక్ నుంచి మెల్లిగా పరిచయం అయి క్లోజ్ అయ్యాం. మూడో వారం నుంచే మేమిద్దరం బాగా క్లోజ్ అయ్యాము. నేను ఏం చెప్పినా ఎంత చెప్పినా డిమాన్ నన్ను భరిస్తాడు. కావాలంటే తిరిగి తిడతాడు కూడా. హౌస్ లో సరదాగా డైలీ గొడవలు పడేవాళ్ళం. మేము బయటకు వచ్చిన దగ్గర్నుంచి అసలు గొడవ పడలేదు. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఫైర్ స్టార్మ్ జరిగినప్పుడు నేను బయటకి వెళ్ళిపోవాలి అనుకున్నాను. అప్పుడు డిమాన్ ని నాతో మాట్లాడొద్దు అన్నారు. ఆ వారం చాలా కష్టపడ్డాను. అన్ని వీక్స్ అతనితో ఉండి అతనితో మాట్లాడొద్దు అంటే నా వల్ల కాలేదు. అందరూ నా గురించి అతనికి నెగిటివ్ గా చెప్పారు. చాలా కష్టంగా ఉండేది అప్పుడు. కానీ అప్పుడు కూడా డిమాన్ నాకు సపోర్ట్ గా ఉన్నాడు. ఎవరెన్ని చెప్పినా నా గురించి తెలుసు అని నాకు సపోర్ట్ చేసాడు అని తెలిపింది.

అయితే ఎలాంటి భర్త కావాలి అంటే రీతూ కొన్ని లక్షణాలు చెప్పగా డిమాన్ పవన్ లాంటి వాడు అయితే పర్ఫెక్ట్ సరిపోతాడా అని అడగ్గా అవును అని చెప్పింది రీతూ. అసలే ఈ జంట ఇప్పుడు BB జోడిలో డ్యాన్స్ చేస్తుంది. మరి రానున్న రోజుల్లో వీరి బంధం ఇంకెంత ముందుకు వెళ్తుందో చూడాలి.

Also Read : Ram Charan : రామ్ చరణ్ లేటెస్ట్ స్టైలిష్ లుక్స్ చూశారా..? ఏమున్నాడ్రా బాబు.. ఫొటోలు వైరల్..