Manisharma : మెగాస్టార్ పై అభిమానంతో మరోసారి రక్తదానం చేసిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..
తాజాగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మెలోడీ బ్రహ్మ మణిశర్మ మెగాస్టార్ చిరంజీవిపై అభిమానంతో ఆయన బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసారు.

Music Director Manisharma Blood Donation in Chiranjeevi Blood Bank
Manisharma : మెగాస్టార్ చిరంజీవి తన ఐ అండ్ బ్లడ్ బ్యాంక్‌తో ఎంతోమందికి ప్రాణదాతగా నిలిచారు. ఆయన అభిమానులు రోజూ ఆ బ్లడ్ బ్యాంక్ లో రక్తదానాలు చేస్తూనే ఉంటారు. చాలా మంది సెలబ్రిటీలు కూడా మెగాస్టార్ అభిమానులు అని తెలిసిందే. ఇప్పటీ సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మంది చిరంజీవి మీద అభిమానంతో రక్తదానం చేసారు.
Also Read : Allu Arjun – Dhanaraj : అల్లు అర్జున్ గారిని ఆ రోజు కాల్ చేయమని చెప్పాను.. గుర్తుంచుకొని మరీ కాల్ చేసి..
తాజాగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మెలోడీ బ్రహ్మ మణిశర్మ మెగాస్టార్ చిరంజీవిపై అభిమానంతో ఆయన బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసారు. ఇలా మణిశర్మ రక్తదానం చేయటం ఇది రెండోసారి కావటం విశేషం. మెగాస్టార్ – మణిశర్మ కాంబోలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్ వచ్చిన సంగతి తెలిసిందే. పాటలకు స్వరాలు కూర్చడమే కాదు మానవత్వానికి చిరునామాగా నిలవడమూ తెలుసునని నిరూపించారు మణిశర్మ.
రక్తదానం అనంతరం మణిశర్మ మాట్లాడుతూ.. ఎప్పట్నుంచో రక్తదానం చేయాలని అనుకుంటున్నాను. నేను నా సంగీతాన్ని చిరంజీవి గారి సినిమాలకు అందించటం ద్వారా అభిమానాన్ని చాటుకున్నాను. ఇప్పుడు రక్తదానం చేయటం సంతోషంగా ఉంది. ఇది నా వంతు కర్తవ్యంగా భావిస్తున్నాను. లక్షలాది మంది ఇందులో భాగమైయ్యారు. అందులో నేను ఒక బొట్టులాగా ఇప్పుడు చేరాను. ఇలాంటి మంచి కార్యక్రమంలో అందరూ భాగం కావాలి అని అన్నారు.