Thaman S : వామ్మో.. తమన్ మూవీ లైనప్ చూసారా.. ఒకేసారి అన్ని సినిమాలా..
దక్షిణాది టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరైన తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలకి మ్యూజిక్ అందించి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఎంతో మంది స్టార్ హీరో సినిమాలకి మ్యూజిక్ అందించారు.

Music director Taman movie line up
Thaman S : దక్షిణాది టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరైన తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలకి మ్యూజిక్ అందించి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఎంతో మంది స్టార్ హీరో సినిమాలకి మ్యూజిక్ అందించారు. కేవలం తెలుగులోనే కాకుండా తెలుగు, తమిళం, హిందీ వంటి భాషల్లో సినిమాలకి కూడా మ్యూజిక్ అందించాడు థమన్. ప్రస్తుతం స్టార్ హీరో సినిమాలకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన మూవీ లైనప్ చూసి షాక్ అవుతున్నారు సినీ ఆడియన్స్..
అయితే ప్రస్తుతం తమన్ చేతిలో దాదాపుగా 11 సినిమాలు ఉన్నాయి. అందులో.. త్వరలోనే రాబోతున్న అల్లు అర్జున్ పుష్ప 2. ఈ సినిమాకి బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు తమన్. అలాగే ప్రభాస్ మూవీ రాజా సాబ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ, నందమూరి బాలయ్య చిత్రం అఖండ 2 ఉన్నాయి. అలాగే బాలీవుడ్ మూవీ బేబీ జాన్‌కు కూడా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. బాలీవుడ్ మూవీ జాట్ లతో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు తమన్.
Also Read : Pushpa 2 : పుష్ప 2 ట్రైలర్ లో అరగుండుతో ఉన్న ఈ నటుడు ఎవరో తెలుసా..?
అంతేకాకుండా శబ్దం, తెలుసు కద, అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమాకి కూడా తమనే మ్యూజిక్ అందిస్తున్నారు. ఇలా ఇన్ని పెద్ద సినిమాలకి మ్యూజిక్ అందిస్తున్నారు. మ్యూజిక్ కి తగట్టు రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయి లో తీసుకుంటున్నాడట తమన్. ఇక ఇప్పటికే ఈ టాప్ లిస్ట్ లో తమన్ తో పాటు అనిరుద్, దేవిశ్రీ ప్రసాద్ కూడా ఉన్నారు అని చెప్పొచ్చు.