Thaman – OG : పవన్ OG సినిమాపై తమన్ ట్వీట్.. వాళ్లకు అది బిగ్గెస్ట్ సినిమా అవుతుంది..

తమన్ OG సినిమా గురించి ఆసక్తికర ట్వీట్ చేసాడు.

Music Director Thaman Interesting Tweet on Pawan Kalyan OG Movie

Thaman – OG : పవన్ కళ్యాణ్ ఇటీవలే ఆగిపోయిన సినిమాల షూట్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే,. ప్రస్తుతం హరిహర వీరమల్లు షూట్ చేస్తున్నారు. అది అయ్యాక OG షూట్ మొదలుపెట్టనున్నారు. పవన్ ఫ్యాన్స్ OG సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్, టీజర్ భారీ అంచనాలు నెలకొల్పాయి.

గేమ్ ఛేంజర్ అప్డేట్స్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వరుసగా ఇస్తుండటంతో పవన్ ఫ్యాన్స్ OG అప్డేట్స్ కూడా అడుగుతున్నారు. దీంతో తమన్ OG సినిమా గురించి ఆసక్తికర ట్వీట్ చేసాడు.

Also Read : NTR – Devara 2 : దేవర 2 కొంత షూట్ చేశాము.. కొరటాల శివకు నెల రోజులు హాలిడే.. హాలీవుడ్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్..

తమన్ తన ట్వీట్ లో.. అందరూ OG అప్డేట్స్ గురించి అడుగుతున్నారు. త్వరలోనే ఇస్తాము. ఆ పనులు కూడా జరుగుతున్నాయి. కచ్చితంగా చెప్పగలను మా నుంచి ఇండస్ట్రీ హిట్ వస్తుంది. సుజీత్ అదరగొట్టేసాడు. కెమెరామెన్ రవిచంద్రన్ అదిరిపోయే విజువల్స్ ఇచ్చాడు. ఇప్పుడు నేను OG కు బెస్ట్ ఇవ్వాలి. ఇది DVV మూవీస్ బ్యానర్ కు బిగ్గెస్ట్ సినిమా అవవుతుంది. నా ట్వీట్ పిన్ చేసి పెట్టుకోండి. అప్డేట్స్ తో త్వరలో కలుద్దాం అని తెలిపాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. OG సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుకుంటున్నారు.