NTR – Devara 2 : దేవర 2 కొంత షూట్ చేశాము.. కొరటాల శివకు నెల రోజులు హాలిడే.. హాలీవుడ్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్..
హాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ దేవర పార్ట్ 2 గురించి, కొరటాల శివ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

NTR Comments on Devara 2 and Koratala Siva in Hollywood Interview
NTR – Devara 2 : ఎన్టీఆర్ దేవర సినిమా ఇటీవల రిలీజయి మంచి విజయం సాధించింది. ఇప్పటికే ఈ సినిమా 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి బ్రేక్ ఈవెన్ కూడా అయింది. ప్రస్తుతం దేవర సినిమా లాభాల బాట పట్టింది. దసరా హాలిడేస్ కూడా ఉండటంతో 500 కోట్ల టార్గెట్ పెట్టుకుంది దేవర. తాజాగా దేవర మూవీ యూనిట్ సక్సెస్ మీట్ కూడా చేసుకున్నారు.
దేవర రిలీజ్ సమయంలో ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లి అక్కడ ప్రమోషన్స్ చేసిన సంగతి తెలిసిందే. బియాండ్ ఫెస్ట్ లో పాల్గొనడం, అక్కడి మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇవ్వడం చేసారు. హాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ దేవర పార్ట్ 2 గురించి, కొరటాల శివ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Also Read : Mr Idiot Song : ‘మిస్టర్ ఇడియట్’ నుంచి ‘కాంతార కాంతార..’ సాంగ్ విన్నారా..?
ఎన్టీఆర్ మాట్లాడుతూ.. దేవర రిజల్ట్ బాగుంది, పార్ట్ 2 ఉంటుంది. ఆల్రెడీ కథ సిద్దమైపోయింది, దాన్ని ఇంకా బాగా రాసుకోవాలి. దేవర పార్ట్ 2లో ఓ రెండు మేజర్ సీన్స్ కూడా షూటింగ్ అయిపోయింది. డైరెక్టర్ కొరటాల శివకు మొత్తం అన్ని వదిలేసి ఓ నెల రోజులు రెస్ట్ తీసుకో, హాలిడేకు వెళ్ళు అని చెప్పాను. ఆ తర్వాత వచ్చి మళ్ళీ దేవర 2 మీద వర్క్ చేయమని చెప్పాను. దేవర 2 పార్ట్ 1 కంటే ఇంకా పెద్దగా గొప్పగా అంటుంది అని తెలిపారు.
#Devara Part 2 will be BIGGER & BETTER 🔥🔥🔥🤙🏻🤙🏻🤙🏻 pic.twitter.com/48HzILBVI2
— Devara (@DevaraMovie) October 4, 2024
దీంతో కొరటాల శివ నెక్స్ట్ సినిమా దేవర 2నే ఉంటుందని తెలుస్తుంది. ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా పూర్తవ్వగానే దేవర 2 షూట్ మొదలుపెడతాడని సమాచారం.