Music Director Thaman Reveals Hero Aadi Pinishetty and Director Arrested on his Birthday
Thaman : తమన్ ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు. మాస్, క్లాస్ సాంగ్స్ తో, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆడియన్స్ ని మెప్పిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ్ సినిమాలు కూడా చేస్తున్నాడు తమన్. తాజాగా ఆది పినిశెట్టి హీరోగా నటించిన శబ్దం సినిమాకు తమన్ మ్యూజిక్ అందించాడు. ఇది హారర్ సినిమా. చాన్నాళ్ల తర్వాత తమన్ హారర్ మ్యూజిక్ ఇవ్వడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
శబ్దం సినిమా ఫిబ్రవరి 28న రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తమన్ కూడా మూవీ టీమ్ తో కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయం తెలిపాడు.
Also Read : Posani : పోసాని ఇంటిపేరుతో ఉన్న హీరో ఎవరో తెలుసా..? మహేష్ బాబుకు చాలా దగ్గరి బంధువు కూడా..
తమన్ మాట్లాడుతూ.. ఆ రోజు నా బర్త్ డే. చెన్నై లో అప్పుడే ఓ కొత్త ఫ్లై ఓవర్ కట్టారు. ఆది కాల్ చేసి దాని మీదకు రమ్మన్నాడు. రాత్రి 12 గంటలకు ఎవ్వరు లేరు. ఆది, డైరెక్టర్ కేక్ కటింగ్ కోసం రమ్మన్నారు. ఫ్లై ఓవర్ మధ్యలో కేక్ కటింగ్ చేస్తుంటే వెనకాలే పోలీసులు వచ్చి ఆదిని, డైరెక్టర్ ని అరెస్ట్ చేసారు. నన్ను బర్త్ డే అని వదిలేసారు. వాళ్లిద్దరూ రాత్రంతా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. పొద్దున 8కి ఫోన్ చేసి ఇప్పుడే రిలీజ్ అయ్యాం. హ్యాపీ బర్త్ డే, పార్టీ ఎక్కడ అని అడిగాడు ఆది అని తెలిపాడు.
Also Read : రాజమౌళి ఫ్రెండ్ సంచలన వీడియో.. నన్ను టార్చర్ చేస్తున్నాడు.. 30 ఏళ్ళ జీవితం త్యాగం చేశా..
ఆది మాట్లాడుతూ.. బర్త్ డేకి మేము క్రాకర్స్ కూడా కాల్చాము. ఆ క్రాకర్స్ వల్ల పక్కనే ఓ మిస్టర్ ఇంట్లో అందరూ డిస్టర్బ్ అయ్యారు అంట. మేము అరెస్ట్ అవ్వడానికి అదికూడా ఒక కారణం అని తెలిపాడు. మొత్తానికి తమన్ పుట్టిన రోజు నాడు హీరో ఆది, డైరెక్టర్ అరివళగన్ అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్ లో రాత్రంతా ఉండొచ్చారు అని లీక్ చేసేసాడు.