Posani : పోసాని ఇంటిపేరుతో ఉన్న హీరో ఎవరో తెలుసా..? మహేష్ బాబుకు చాలా దగ్గరి బంధువు కూడా..

మీకు పోసాని ఇంటి పేరుతో ఓ హీరో కూడా ఉన్నాడన్న సంగతి తెలుసా?

Posani : పోసాని ఇంటిపేరుతో ఉన్న హీరో ఎవరో తెలుసా..? మహేష్ బాబుకు చాలా దగ్గరి బంధువు కూడా..

Do You Know a Hero Surname is Posani He Related to Mahesh Babu Also

Updated On : February 27, 2025 / 3:12 PM IST

Posani : నిన్నటి నుంచి పోసాని కృష్ణ మురళి వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి పోలీసులు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసారు. గతంలో పోసాని చంద్రబాబు, పవన్ పై, వాళ్ళ ఫ్యామిలీలపై తీవ్ర విమర్శలు చేసాడు. దీంతో అతనిపై పలువురు కార్యకర్తలు, అభిమానులు కేసులు నమోదు చేసారు. ఈ కేసు నేపథ్యంలోనే నిన్న రాత్రి పోలీసులు పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేయడంతో పోసాని వైరల్ అవుతున్నాడు.

అయితే మీకు పోసాని ఇంటి పేరుతో ఓ హీరో కూడా ఉన్నాడన్న సంగతి తెలుసా? అతనికి పోసాని కృష్ణ మురళికి చుట్టరికం ఏం లేకపోయినా ఆ హీరో ఇంటిపేరు కూడా పోసానినే. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా.. సుధీర్ బాబు. మహేష్ బాబు చెల్లెలు ప్రియదర్శినిని పెళ్లి చేసుకున్నాడు సుధీర్ బాబు. అలా మహేష్ కి బావ కూడా అయ్యాడు. సుధీర్ ఒకపుడు బ్యాడ్మింటన్ ప్లేయర్.

Also Read : రాజమౌళి ఫ్రెండ్ సంచలన వీడియో.. నన్ను టార్చర్ చేస్తున్నాడు.. 30 ఏళ్ళ జీవితం త్యాగం చేశా..

సుధీర్ బాబు గతంలో ఏపీ, కర్ణాటక తరపున బ్యాడ్మింటన్ స్టేట్ లెవల్లో ఆడాడు. పుల్లెల గోపీచంద్ తో కలిసి డబుల్స్ కూడా ఆడాడు. భవిష్యత్తులో పుల్లెల గోపీచంద్ బయోపిక్ సుధీర్ బాబు చేస్తాడనే వినిపిస్తుంది. శివ మనసులో శృతి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. శివ మనసులో శృతి, ప్రేమ కథ చిత్రం, భలే మంచి రోజు, శమంతకమణి, సమ్మోహనం.. లాంటి పలు హిట్ సినిమాలు అందించాడు. ఇటీవల కొత్త కొత్త కథలతో సినిమాలు తీస్తున్నా అవి పరాజయం పాలవుతున్నాయి.

Do You Know a Hero Surname is Posani He Related to Mahesh Babu Also

Also Read : Kiran Abbavaram : బేబీ బంప్ తో కిరణ్ అబ్బవరం భార్య.. స్పెషల్ ప్లేస్ లో శివరాత్రి సెలబ్రేట్ చేసుకున్న క్యూట్ కపుల్..

సుధీర్ బాబు చివరగా మా నాన్న సూపర్ హీరో సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం జటాధరా అనే పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇండస్ట్రీలో బాడీని రెగ్యులర్ గా ఫిట్ గా మెయింటైన్ చేసే హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. సుధీర్ – ప్రియదర్శిని జంటకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. చరత్ మానస్, దర్శన్. ఈ ఇద్దరూ కూడా చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమాల్లో నటించారు. చరత్ మానస్ హీరో అవుతాడని అంటున్నారు.