Music Director Thaman Sensational Comments on Game Changer Movie and Director Shankar
Thaman – Game Changer : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల సంక్రాంతికి గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలతో వచ్చి అదరగొట్టాడు తమన్. ఈ రెండు సినిమాల్లోని సాంగ్స్ ప్రేక్షకులని, ఫ్యాన్స్ ని మెప్పించాయి. తాజాగా తమన్ ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ సినిమాపై, సాంగ్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
తమన్ మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ సాంగ్స్ ని నేను 2021 లోనే పూర్తి చేశాను. రిలీజ్ అయ్యేసరికి ఆ సాంగ్స్ పాతవి అయిపోయాయి అనిపిస్తుంది. శంకర్ సర్ ముందు ఆరు పాటలు పూర్తి చేసిన తర్వాతే టాకీ పార్ట్ షూటింగ్ కి వెళ్తా అన్నారు. దాంతో నేను ఫస్ట్ సాంగ్స్ ఇచ్చేసాను. 2025లో సినిమా రిలీజ్ అయింది. ఆ సాంగ్స్ ని నేను మళ్ళీ ఇప్పటి టెక్నాలజీకి తగ్గట్టు అప్డేట్ చేయాల్సి వచ్చింది. అది చాలా పెద్ద పని. ఒక ట్యూన్ ని నాలుగేళ్లు అలా ఉంచడం చాలా కష్టం. ఈ గ్యాప్ లో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. చాలా అప్డేట్స్ వచ్చాయి. నేను కూడా ఆల్బమ్ ట్రెండ్ కి తగ్గట్టు ఉండటానికి నా బెస్ట్ ఇచ్చాను. ట్యూన్ అదే ఉంటుంది కానీ సాంగ్స్ రీ రికార్డింగ్ చేస్తాను, సింగర్స్ మారుస్తాను, టెక్నాలజీని మారుస్తాను. శంకర్ సర్ కి – రహమాన్ సర్ కి కూడా అదే సమస్య. శంకర్ సర్ సినిమా అనౌన్స్ చేసిన రెండేళ్లకు రిలీజ్ చేసారు. రహమాన్ సర్ రెండేళ్లు ఆ సాంగ్స్ ని అప్డేట్ చేసుకోవాలి, అది పెద్ద వర్క్ అని అన్నారు.
దీంతో తమన్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. గేమ్ ఛేంజర్ సినిమా 2021 లోనే ప్రకటించారు. కానీ షూటింగ్స్ ఆలస్యం అవ్వడం, మధ్యలో శంకర్ భారతీయుడు 2 సినిమాకు వెళ్లడంతో సినిమా చాలా లేట్ అయింది. అప్పటికి పాటలు బానే ఉన్నా సినిమా ఓల్డ్ స్టైల్ లో ఉండటంతో సంక్రాంతికి రాగా యావరేజ్ గా నిలిచింది. మరి తమన్ కామెంట్స్ పై గేమ్ ఛేంజర్ టీమ్ కానీ, ఫ్యాన్స్ కానీ స్పందిస్తారేమో చూడాలి.