800 Trailer
800 Trailer : శ్రీలంక క్రికెట్ దిగ్గజం, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న సినిమా 800. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. టెస్టు క్రికెట్‌లో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా నిలిచిన ముత్తయ్య మురళీధరన్ పాత్రలో స్లమ్‌డాగ్ మిలియనీర్ ఫేమ్ మధుర్ మిట్టల్ నటిస్తున్నారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటిస్తోంది.
తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈ వెంట్‌ను ముంబైలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ విచ్చేశాడు. ఆయన చేతుల మీదుగానే ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. సచిన్, ముత్తయ్య మురళీధరన్‌లు ప్రత్యర్థులు ఎన్నో మ్యాచులను ఆడినప్పటికీ, మైదానం బయట వారిద్దరు ఎంతో మంచి మిత్రులు అన్న సంగతి తెలిసిందే.
Peddha Kapu 1 : సెప్టెంబర్‌లోనే వచ్చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల పెదకాపు-1.. రిలీజ్ డేట్..!
ట్రైలర్‌ను చూస్తే.. ముత్తయ్య మురళీధరన్ నిజ జీవితంలో ఆయన ఎదుర్కొన్న ఎన్నో సంఘటనలు, ఎత్తు పల్లాలను భావోద్వేగభరితంగా చూపిస్తున్నట్లు అర్థం అవుతోంది. శ్రీలంక టీమ్‌లో ఆయన ఎంపిక కావడానికి పడిన కష్టాలు, జట్టులోకి వచ్చిన తాను గొప్ప బౌలర్‌గా ఆవిష్కరించుకున్న తీరును చూపించారు. మొత్తంగా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. జిబ్రాన్ మ్యూజిక్ బాగుంది.
తమిళంలో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ఆల్ఇండియా పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ దక్కించుకున్నారు.
Balakrishna : జైలర్ సీక్వెల్.. ఈ సారి మాత్రం బాలయ్య పక్కా ఉండాల్సిందే..