Peddha Kapu 1 : సెప్టెంబర్‌లోనే వచ్చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల పెదకాపు-1.. రిలీజ్ డేట్..!

న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్‌ నేపథ్యంతో శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న పెదకాపు-1 సెప్టెంబర్‌లో థియేటర్ లో సందడి చేయడానికి డేట్ ఫిక్స్ చేసుకుంది.

Peddha Kapu 1 : సెప్టెంబర్‌లోనే వచ్చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల పెదకాపు-1.. రిలీజ్ డేట్..!

Srikanth Addala Virat Karrna Pragati Srivasthava Peddha Kapu 1 release date

Updated On : September 5, 2023 / 3:12 PM IST

Peddha Kapu 1 : టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.. ‘బ్రహ్మోత్సవం’ సినిమాతో భారీ ప్లాప్ ని అందుకొని రేసులో వెన్నకి వెళ్ళిపోయాడు. ఆ తరువాత వెంకటేష్ తో ‘నారప్ప’ వంటి మాస్ మూవీని తీసి హిట్ అందుకున్నా.. అది డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కావడంతో శ్రీకాంత్ అడ్డాలకు మునపటి ఫేమ్ ని తెచ్చిపెట్టలేకపోయింది. ఇప్పుడు ఒక కొత్త కుర్రాడిని హీరోగా పరిచయం చేస్తూ ఒక పెద్ద సినిమాని తెరకెక్కిస్తున్నాడు. న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్‌ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ మూవీకి ‘పెద్ద కాపు’ అనే సామజిక వర్గానికి చెందిన పేరుని టైటిల్ గా పెట్టడం సంచలనం.

Miss Shetty Mr Polishetty : చిరు రివ్యూస్.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తొలి ప్రేక్షకుడ్ని నేనే..

ఇక ఈ మూవీని రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నాడు. మొదటి బాగానే సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తారంటూ గతంలో ప్రకటించినా.. పోటీ ఎక్కువ ఉండడంతో వెనక్కి తగ్గారు. అయితే సలార్ వాయిదాతో మొత్తం సినిమాల రిలీజ్‌ల్లో మార్పులు వచ్చాయి. దీంతో పెదకాపు-1 ని మళ్ళీ సెప్టెంబర్ రేసులోకి తీసుకువచ్చాడు శ్రీకాంత్ అడ్డాల. దాదాపు నాలుగు రోజులు సెలవలు కలిసొస్తున్నాయని సెప్టెంబర్ 29న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Vijay Devarakonda : డబ్బులు ఇచ్చి మరీ నా మీద, నా సినిమా మీద నెగిటివ్‌గా రాపిస్తున్నారు.. విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు..

కాగా ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ అండ్ టీజర్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. కొత్త కుర్రాడు ‘విరాట్ కర్ణ’ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్ గా నటిస్తుండగా రావు రమేష్, నాగబాబు, తనికెళ్ళ భరణి, రాజీవ్ కనకాల, బ్రిగడ సగ, అనసూయ, ఈశ్వరి రావు, నరేన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మరి శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాతో ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి.