Myhtri Movie Makers Shows 500 Crores Difference in Allu Arjun Puhspa 2 Movie Collections Rumours Goes Viral
Pushpa 2 Collections : సుకుమార్(Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప 2 సినిమా గత నెల డిసెంబర్ 5న రిలీజయి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముందు నుంచి ఉన్న హైప్, ప్రమోషన్స్ భారీగా చేయడం, నార్త్ లో ఈ సినిమాకు, అల్లు అర్జున్ కి బాగా కనెక్ట్ అవ్వడంతో థియేటర్స్ లో పుష్ప 2 పెద్ద హిట్ అయింది. మొదటి రోజు నుంచే ఎవరూ ఊహించలేనంతగా కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటి వరకు 1850 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాహుబలి 2 రికార్డులు కూడా బద్దలు కొట్టేశామని మూవీ యూనిట్ అధికారికంగానే చెప్పింది.
అయితే ఇప్పుడు అదే చర్చగా మారింది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ పై నిర్మాతలు నవీన్, రవి శంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. తాజాగా దిల్ రాజుతో పాటు వీరి ఆఫీసులు, ఇళ్లపై, సుకుమార్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. దీంతో టాలీవుడ్ తో పాటు ఫ్యాన్స్, నెటిజన్స్ లో పుష్ప 2 కలెక్షన్స్ విషయం చర్చగా మారింది. ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ వేశారు, అభిమానులను మెప్పించడానికి కలెక్షన్స్ పోస్టర్స్ వేశారు అంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఈ దాడుల నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 కలెక్షన్స్ విషయంలో 500 కోట్లు డిఫరెన్స్ చూపించారు అని ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
Also See : నాగచైతన్య – సాయి పల్లవి ‘తండేల్’ సినిమా రెండో పాట విన్నారా?
అయితే కొంతమంది ఫ్యాన్స్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని 500 కోట్లు తక్కువ కలెక్షన్స్ చూపించారు అంటే పుష్ప 2 సినిమా అసలు కలెక్షన్స్ 2300 కోట్లు అని, అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాగా దంగల్ రికార్డు ని ఆల్రెడీ బ్రేక్ చేసిందని పోస్టులు వేస్తున్నారు. దీన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్. మరికొంతమంది నెటిజన్లు మాత్రం తప్పుడు కలెక్షన్స్ చూపించారని, ఫ్యాన్స్ కోసం 500 కోట్లు ఎక్కువ వేసి చూపించారని, రియల్ కలెక్షన్స్ కేవలం 1300 కోట్లే అని అంటున్నారు.
500 కోట్లు వ్యత్యాసం అయితే చూపించారని వార్తల్లో కూడా వచ్చింది. అయితే ఆ వ్యత్యాసం ప్లస్ చేసి చూపించారా? మైనస్ చేసి చూపించారా అనేది తెలియాలి. ఈ లెక్కన అసలు పుష్ప 2 కలెక్షన్స్ ఎంత? 1300 కోట్లా? 1800 కోట్లా? 2300 కోట్లా? ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వండి అని మూవీ యూనిట్ అని అడుగుతున్నారు. మరి దీనిపై మైత్రి మూవీ మేకర్స్ సమాధానం ఇస్తుందా చూడాలి.
Also Read : Gandhi Tatha Chettu : ‘గాంధీ తాత చెట్టు’ మూవీ రివ్యూ.. సుకుమార్ కూతురి ఫస్ట్ సినిమా ఎలా ఉందంటే..?
ఇటీవల గేమ్ ఛేంజర్ సినిమాకు కూడా మొదటి రోజు 186 కోట్ల గ్రాస్ వేస్తే అవి తప్పుడు కలెక్షన్స్ అని పలువురు కామెంట్స్ చేశారు. దేవర సమయంలో కూడా ఎక్కువ కలెక్షన్స్ చూపించారని కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు పుష్ప 2 విషయంలో కూడా కలెక్షన్స్ లో తేడా చూపించారని అంటున్నారు. దీంతో అసలు సినిమా వాళ్ళు చెప్పే కలెక్షన్స్ నిజమేనా అని సందేహం కలుగుతుంది. ఇలాంటి రూమర్స్ వల్ల నిజం కలెక్షన్స్ చెప్పేవాళ్ళని కూడా నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది. కేవలం ఫ్యాన్స్ ని ఆనందపరచడానికే ఎక్కువ కలెక్షన్స్ వేస్తున్నారు అంటే రాబోయే కాలంలో సినిమా కలెక్షన్స్ ని కూడా పట్టించుకోని పరిస్థితి ఏరపడుతుంది అంటున్నారు.