Mistary : అక్టోబర్ 6న ‘మిస్టరీ’..

సాయికృష్ణ, స్వప్న చౌదరి హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్న చిత్రం మిస్టరీ (Mystery). తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాని పి.వి.ఆర్ట్స్ పతాకంపై వెంకట్ పులగం నిర్మిస్తున్నారు.

Mistary : అక్టోబర్ 6న ‘మిస్టరీ’..

Mystery Release date fix

Updated On : September 17, 2023 / 7:12 PM IST

Mystery Release date : సాయికృష్ణ, స్వప్న చౌదరి హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్న చిత్రం మిస్టరీ (Mystery). తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాని పి.వి.ఆర్ట్స్ పతాకంపై వెంకట్ పులగం నిర్మిస్తున్నారు. సుమన్, అలీ, తనికెళ్ల భరణి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి కాగా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటోంది. అక్టోబర్ 6న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ పులగం మాట్లాడుతూ.. మిస్టరీ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌న్నారు. సినిమాలో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ట్విస్ట్‌లు ఉంటాయ‌న్నారు. కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన తనికెళ్ల భరణి, అలీ, సుమన్ ల‌కు ఈ సంద‌ర్భంగా ధన్యవాదాలు తెలియ‌జేశారు. సినిమా అద్భుతంగా వ‌చ్చింద‌న్నారు. అక్టోబర్ 6న 100 థియేటర్స్ లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్లడించారు.

7G Brindavan Colony : 7జీ బృందావన కాలని సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ.. వచ్చే నెల నుంచి..

డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ.. మిస్ట‌రీ చిత్రం ఓ కామెడీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కింద‌న్నారు. అవుట్ పుట్ అద్భుతంగా వ‌చ్చింద‌ని, టీం సభ్యులు ఉన్న పోస్టర్ ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు. సినిమాను విజ‌యవంతంగా పూర్తి చేయ‌డంలో స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. వెంకట్ దుగ్గి రెడ్డి, రవి రెడ్డి, బాబీ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సత్య శ్రీ, గడ్డం నవీన్, అకెల్లా, సి.కే.రెడ్డి, శోభన్ లు నటిస్తున్న ఈ సినిమాకి కథ మాటలు శివ కాకు, సంగీతం రామ్ తవ్వ అందించారు.