Mythri Movie Makers : లీకేజులపై పోలీసులను ఆశ్రయించిన మైత్రీ మూవీస్..

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థను లీకేజులు వెంటాడుతున్నాయి.. దీంతో నిర్మాతలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు..

Mythri Movie Makers : లీకేజులపై పోలీసులను ఆశ్రయించిన మైత్రీ మూవీస్..

Mythri Movie Makers

Updated On : August 16, 2021 / 5:31 PM IST

Mythri Movie Makers: వరుస విజయాలు, ఇండస్ట్రీ హిట్స్‌తో దూసుకెళ్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థను లీకేజులు వెంటాడుతున్నాయి. దీంతో వారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూపర్ స్టార్ మహష్ బాబు ‘సర్కారు వారి పాట’, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాల విషయంలో ఈ లీకేజులు జరిగాయి.

Sarkaru Vaari Paata First Notice : ఈసారి పాట ‘మోత మోగిపోద్దమ్మా’..

మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ.. ‘సర్కారు వారి పాట’.. పరశురామ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తుండగా కీర్తి సురేష్ ఫస్ట్ టైం మహేష్ పక్కన యాక్ట్ చేస్తోంది.

మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9వ తేది ఉదయం 9:09 గంటలకు బర్త్‌డే బ్లాస్టర్ పేరుతో వీడియో రిలీజ్ చెయ్యబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. కట్ చేస్తే 9వ తేది అర్థరాత్రి సరిగ్గా 12 గంటలకు వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. దీంతో నిర్మాతలు షాక్ అయ్యారు.
‘పుష్ప’ పాటనూ వదల్లేదు..

Pushpa : డీఎస్పీ మరో చార్ట్ బస్టర్.. ‘దాక్కో దాక్కో దాక్కో మేక’..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం.. ‘పుష్ప’.. రష్మిక మందన్న కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఆగస్టు 13 ఉదయం ఈ మూవీలోనుండి ‘దాక్కో దాక్కో దాక్కో మేక’ అనే ఫస్ట్ లిరకల్ సాంగ్ రిలీజ్ చేశారు.

Mythri Movie Makers

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా.. చంద్రబోస్ అద్భుతమైన లిరిక్స్ రాశారు. ఈ పాటను తెలుగులో శివమ్, హిందీలో విశాల్ దడ్లాని, కన్నడలో విజయ్ ప్రకాష్, మలయాళంలో రాహుల్ నంబియార్, తమిళ్‌లో బెన్ని దయాళ్ చాలా బాగా పాడారు. అయితే 12వ తేది అర్థరాత్రి నుండే ‘పుష్ప’ తెలుగు సాంగ్ నెట్టింట వైరల్ అయ్యింది.

Mythri Movie Makers

దీంతో నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవి శంకర్.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులకు సంబంధించిన లీకేజులు ఎలా జరిగాయి అనే దానిపై విచారణ చేపట్టారు. కాగా ‘పుష్ప’ క్రిస్మస్ కానుకగా విడుదలవుతుండగా.. ‘సర్కారు వారి పాట’ 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.