Naa Saami Ranga star Nagarjuna films released in sankranti total list and result details
Nagarjuna : నాగార్జున ‘నా సామిరంగ’ సినిమాతో ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. నాగార్జున తన కెరీర్ లో చాలా తక్కువసార్లే సంక్రాంతి బరిలో పోటీకి దిగారు. కానీ దిగిన ప్రతిసారి సూపర్ హిట్టుని అందుకున్నారు. ఆ చిత్రాలు ఏంటో ఓ లుక్ వేసేయండి..
#మజ్ను..
లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం 1987 సంక్రాంతి బరిలో.. అప్పటి స్టార్ హీరోలు శోభన్ బాబు, కృష్ణ మరియు బాలకృష్ణ చిత్రాలతో బాక్స్ ఆఫీస్ పోటీకి దిగింది. ఈ పోటీలో నాగార్జున బ్లాక్ బస్టర్ హిట్టుని సొంతం చేసుకొని సంక్రాంతి విజేత అనిపించుకున్నారు.
#కిల్లర్..
ఐదేళ్ల తరువాత 1992లో మరోసారి సంక్రాంతి పోటీకి వచ్చారు. ఈసారి యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కిల్లర్’తో వచ్చి సూపర్ హిట్టుని అందుకున్నారు. 100 రోజులకు పైగా థియేటర్స్ ఆడిన ఈ చిత్రాన్ని తమిళంలోకి డబ్ చేసి రిలీజ్ చేశారు.
#ఆవిడ మా ఆవిడే..
‘హలో బ్రదర్’ సినిమా తరువాత ఈవీవీ, నాగ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఆవిడ మా ఆవిడే’ చిత్రం పై ఆడియన్స్ లో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో సినిమా ఎబో యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ.. భారీ ఓపెనింగ్స్ రావడంతో కమర్షియల్ గా సక్సెస్ అనిపించుకుంది. 1998 సంక్రాంతి రేసులో ఈ సినిమా నిలిచింది.
Also read : Mahesh Babu : మహేష్ సంక్రాంతి బరిలో ఎన్నిసార్లు హిట్స్ కొట్టాడు..?
#సోగ్గాడే చిన్ని నాయనా..
మళ్ళీ 18 ఏళ్ళ తరువాత 2016లో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాతో సంక్రాంతికి వచ్చి కెరీర్ బిగ్గెస్ట్ హిట్టుని అందుకున్నారు. ఇప్పటికి ఆ సినిమానే నాగ్ కెరీర్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది.
#బంగార్రాజు..
ఆ తరువాత ఆరేళ్ళకి ‘సోగ్గాడే చిన్ని నాయనా’కి సీక్వెల్ గా ‘బంగార్రాజు’ని 2022 సంక్రాంతికి తీసుకువచ్చి మరోసారి హిట్టుని అందుకున్నారు. ఇదే నాగ్ చివరి సంక్రాంతి సినిమా.
మళ్ళీ రెండేళ్ల తరువాత ఇప్పుడు ‘నా సామిరంగ’ సినిమాతో వస్తున్నారు. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ముఖ్య పాత్రలు చేస్తున్న ఈ చిత్రం మలయాళ సూపర్ హిట్ మూవీ ‘పోరింజు మరియం జోస్’కి రీమేక్ గా వస్తుంది. ఆల్రెడీ రిలీజైన ట్రైలర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. మరి నాగ్ ఈ సినిమాతో కూడా హిట్ అందుకొని.. తన సంక్రాంతి విజయాల పరంపరని కొనసాగిస్తారా..? లేదా..? అనేది చూడాలి.