Mahesh Babu : మహేష్ సంక్రాంతి బరిలో ఎన్నిసార్లు హిట్స్ కొట్టాడు..?
మహేష్ తన కెరీర్ లో సంక్రాంతి బరిలో ఎన్నిసార్లు నిలిచి.. ఎన్నిసార్లు హిట్స్ కొట్టాడు..?

Guntur Kaaram hero Mahesh Babu films released in sankranti total list and result details
Mahesh Babu : సూపర్ స్టార్ ‘మహేష్ బాబు’ ఈ సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేయబోతున్నారు. రికార్డు స్థాయిలో విడుదలవుతూ రిలీజ్ కి ముందే బుకింగ్స్ తో రికార్డు కలెక్షన్స్ నమోదు చేస్తూ ఆల్రెడీ హిట్టు అనే ముద్రని సొంతం చేసేసుకుంది. అయితే మహేష్ తన కెరీర్ లో సంక్రాంతికి ఎన్నిసార్లు హిట్స్ కొట్టాడు..?
#టక్కరి దొంగ..
‘కౌ బాయ్’ పాత్రలో మహేష్ బాబు కనిపిస్తూ చేసిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘టక్కరి దొంగ’. భారీ అంచనాలతో 2002 సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా ప్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది.
#ఒక్కడు..
దీంతో మహేష్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సంక్రాంతికి తన సినిమాని తీసుకు వచ్చారు. 2003 సంక్రాంతి బరిలో ‘ఒక్కడు’ సినిమాని దింపి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. ఈ మూవీ మహేష్ కెరీర్ లోనే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఓ మైల్ స్టోన్ గా నిలిచింది.
#బిజినెస్‌మెన్..
‘ఒక్కడు’ తరువాత మహేష్ మళ్ళీ తొమ్మిదేళ్ల వరకు సంక్రాంతి భారీ వైపు చూడలేదు. 2012లో ‘బిజినెస్‌మెన్’తో పందెం కోడిలా దూకి విజయం అందుకున్నారు. పోకిరి తరువాత పూరి, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ కావడంతో థియేటర్ వద్ద కాసుల వర్షం కురిసింది.
Also read : Venkatesh : వెంకీ మామ సంక్రాంతికి ఎన్నిసార్లు వచ్చాడు..? ఎన్నిసార్లు విజయం సాధించాడు..?
#సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు..
ఇక ఆ తరువాతి ఏడాది 2013లో మల్టీస్టారర్ పద్ధతికి మళ్ళీ ఊపిరి పోస్తూ.. వెంకటేష్‌తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీ చేసి సూపర్ హిట్టుని సొంతం చేస్తున్నారు.
#1 నేనొక్కడినే..
‘టక్కరి దొంగ’ తరువాత మహేష్ బాబుకి సంక్రాంతి బరిలో మరోసారి దెబ్బ తగిలిందంటే.. అది 2014లో ‘1 నేనొక్కడినే’ మూవీతోనే. భారీ అంచనాలతో రిలీజైన్ ఈ చిత్రం ప్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది.
#సరిలేరు నీకెవ్వరూ..
ఇక చివరిగా 2020లో ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచారు. ఈ సినిమాలో మహేష్ ని ఫుల్ ఆన్ ఎంటర్టైన్ రోల్ లో కొత్తగా చూసిన ఆడియన్స్.. బాక్స్ ఆఫీస్ వద్ద మూవీని సూపర్ హిట్ చేశారు.
మహేష్ బాబు తన కెరీర్ మొత్తం ఆరుసార్లు సంక్రాంతి బరిలో పోటీ చేశారు. ఈ పోటీలో రెండు సార్లు ప్లాప్స్ ని అందుకుంటే.. నాలుగుసార్లు బ్లాక్ బస్టర్స్ ని అందుకున్నారు. ఇక ఈసారి గుంటూరు కారంతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఈ మూవీ రిలీజవుతున్న థియేటర్స్ లెక్క, ప్రీ బుకింగ్స్ లెక్క చూస్తుంటే.. విడుదలకు ముందే మరో సంక్రాంతి హిట్ అని తెలుస్తుంది.