Venkatesh : వెంకీ మామ సంక్రాంతికి ఎన్నిసార్లు వచ్చాడు..? ఎన్నిసార్లు విజయం సాధించాడు..?
వెంకటేష్ ఇప్పటివరకు ఎన్నిసార్లు సంక్రాంతికి సినిమాలు తీసుకు వచ్చారు..? ఎన్నిసార్లు విజయం సాధించారు..?

Saindhav star Venkatesh films released in sankranti total list and result details
Venkatesh : విక్టరీ వెంకటేష్ ‘సైంధవ్’ సినిమాతో ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం వెంకీ మామ కెరీర్‌లో 75వ సినిమాగా వస్తుంది. కాగా వెంకటేష్ ఇప్పటివరకు ఎన్నిసార్లు సంక్రాంతికి సినిమాలు తీసుకు వచ్చారు..? ఎన్నిసార్లు విజయం సాధించారు..?
#రక్త తిలకం..
మొదటిసారి 1988 సంక్రాంతికి వెంకటేష్ ‘రక్త తిలకం’ మూవీతో వచ్చారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది.
#ప్రేమ..
మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ 1989లో ‘ప్రేమ’ మూవీతో వచ్చిన వెంకటేష్.. కెరీర్ లో మొదటి బిగ్గెస్ట్ హిట్టుని అందుకున్నారు. ఈ చిత్రం వెంకటేష్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది.
#చంటి..
ఆ తరువాత 1992 సంక్రాంతికి ‘చంటి’ వంటి క్లాస్ సినిమాతో వచ్చి ఇండస్ట్రీ హిట్టుని సొంతం చేసుకున్నారు వెంకటేష్.
#పోకిరి రాజా..
1995లో పోకిరి రాజా సినిమాతో సంక్రాంతికి వచ్చిన వెంకటేష్.. యావరేజ్ తో సరిపెట్టుకున్నారు.
#ధర్మ చక్రం..
వెంకటేష్ ని మాత్రమే కాదు తండ్రి కొడుకుల అనుబంధాన్ని కూడా కొత్తగా చూపిస్తూ తెరకెక్కిన ‘ధర్మ చక్రం’.. 1996 సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్టుగా నిలిచింది.
Also read : Nagarjuna : సంక్రాంతి రేసులో నాగార్జున ఎన్నిసార్లు పోటీ చేసి గెలిచాడు..?
#చిన్నబ్బాయి..
ఆ నెక్స్ట్ ఇయర్ 1997లో ‘చిన్నబ్బాయి’ సినిమాతో మళ్ళీ సంక్రాంతికి వచ్చిన వెంకటేష్.. సంక్రాంతి బరిలో మొదటిసారి ప్లాప్ అందుకున్నారు.
#కలిసుందాం రా..
2000లో ‘కలిసుందాం రా’ వంటి ఫ్యామిలీ సినిమాతో సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అందుకోవడమే కాదు నేషనల్ అవార్డుని కూడా అందుకున్నారు.
#దేవి పుత్రుడు..
ఆ తరువాత సంవత్సరం 2001లో ‘దేవి పుత్రుడు’ వంటి విజువల్ ఎఫెక్ట్స్ మూవీతో వచ్చిన వెంకటేష్.. కమర్షియల్ గా సక్సెస్ అందుకోలేకపోయారు.
#లక్ష్మి..
ఐదేళ్ల తరువాత 2006లో ‘లక్ష్మి’ సినిమాతో వచ్చిన వెంకటేష్.. సూపర్ హిట్టుని అందుకున్నారు.
#నమో వేంకటేశ..
మళ్ళీ నాలుగేళ్ళ తరువాత 2010 సంక్రాంతికి ‘నమో వేంకటేశ’ సినిమాతో వచ్చిన వెంకటేష్ యావరేజ్ తో సరిపెట్టుకున్నారు.
#బాడీగార్డ్..
ఆ నెక్స్ట్ 2012లో రీమేక్ కథ ‘బాడీగార్డ్’తో సంక్రాంతి బరిలో మహేష్ తో పోటీపడిన వెంకటేష్.. జస్ట్ హిట్ టాక్ తో ఎబో యావరేజ్ ని అందుకున్నారు.
#సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు..
దీంతో ఆ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి మహేష్ తో కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో వచ్చి సూపర్ హిట్టుని అందుకున్నారు వెంకటేష్.
#గోపాల గోపాల..
ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో కలిసి 2015 సంక్రాంతికి ‘గోపాల గోపాల’తో వచ్చి సూపర్ హిట్టుని అందుకున్నారు.
#F2..
ఇక చివరిగా 2019 సంక్రాంతికి F2 వంటి ఫన్ మూవీతో వచ్చి అందర్నీ ఎంటర్టైన్ చేసి సూపర్ హిట్టుని సొంతం చేసుకున్నారు.
వెంకటేష్ తన కెరీర్ మొత్తం 15 సార్లు సంక్రాంతి బరిలో పోటీ చేస్తే.. రెండు సార్లు ప్లాప్ ని అందుకున్నారు. మూడు సార్లు యావరేజ్ టాక్ ని చూశారు. అంటే 10 సినిమాలతో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ, బ్లాక్ బస్టర్ హిట్స్ ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు సైంధవ్ ట్రైలర్ చూస్తుంటే.. ఈసారి కూడా హిట్ అందుకునేలా కనిపిస్తున్నారు.