Nabha Natesh : కాలేజీ స్టూడెంట్స్‌తో కలిసి స్టేజి మీద డాన్స్‌తో రచ్చ చేసిన నభా నటేష్.. వైరల్ అవుతున్న వీడియో..

ఈవెంట్లో కాలేజీ స్టూడెంట్స్ తో కలిసి ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని చిలక చిలక.. సాంగ్ కి ఓ రేంజ్ లో స్టేజిపై స్టెప్పులు వేసింది నభా నటేష్.

Nabha Natesh : కాలేజీ స్టూడెంట్స్‌తో కలిసి స్టేజి మీద డాన్స్‌తో రచ్చ చేసిన నభా నటేష్.. వైరల్ అవుతున్న వీడియో..

Nabha Natesh Dancing with College Students Video goes viral

Updated On : April 30, 2024 / 10:37 AM IST

Nabha Natesh : కన్నడ భామ నభా నటేష్ తెలుగులో నన్ను దోచుకుందువటే, ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. అయితే నభా నటేష్ కి యాక్సిడెంట్ అయి, ఆపరేషన్ అవ్వడంతో 2021 నుంచి సినిమాలకు దూరంగా ఉండి ఇటీవలే మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుంది. త్వరలో నభా నటేష్, ప్రియదర్శితో కలిసి డార్లింగ్ సినిమాతో రాబోతుంది. అలాగే స్వయంభు సినిమాలో నటిస్తుంది.

Also Read : Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ పై తేలిపోయిన నెగిటివ్ ప్రచారం.. ఓటీటీలో టాప్ లో దూసుకుపోతూ..

తాజాగా నభా నటేష్ కి చెందిన ఓ డాన్స్ వీడియో వైరల్ అవుతుంది. ఇటీవల అనంతపూర్ లోని SV గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ లో జరిగిన ఈవెంట్ కి నభా నటేష్ హాజరైంది. ఆ ఈవెంట్లో కాలేజీ స్టూడెంట్స్ తో కలిసి ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని చిలక చిలక.. సాంగ్ కి ఓ రేంజ్ లో స్టేజిపై స్టెప్పులు వేసింది. సినిమాలో వేసినట్టే స్టేజిపై స్టూడెంట్స్ తో కలిసి డ్యాన్సులు వేసి అదరగొట్టేసింది. మీరు కూడా ఆ డాన్స్ చూసేయండి.

ఇక నిన్న ఇంటర్నేషనల్ డాన్స్ డే కావడంతో నభా నటేష్ ఈ డాన్స్ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్టేజి పై ఈ రేంజ్ లో మాస్ డాన్స్ చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం నభా నటేష్ డాన్స్ వీడియో వైరల్ గా మారింది.