×
Ad

Nabha Natesh : ‘డార్లింగ్’ మూవీ ఈవెంట్‌లో.. నభా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడి.. బాధపెట్టిన ప్రియదర్శి..

'డార్లింగ్' మూవీ ఈవెంట్‌లో నభా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడి.. నటుడు ప్రియదర్శి ఆమెను బాధ పెట్టాడు. దీంతో..

  • Published On : April 20, 2024 / 04:04 PM IST

Nabha Natesh fires on Priyadarshi at Darling movie promo release event

Nabha Natesh : నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నభా నటేష్.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాగా పాపులారిటీని సంపాదించుకున్నారు. కానీ ఆ పాపులారిటీని ఉపయోగించుకోకుండా రెండేళ్లు ఎవరికి కనిపించకుండా వెళ్లిపోయారు. ఆ తరువాత మళ్ళీ తిరిగి వచ్చిన నభా.. తన యాక్సిడెంట్ అయ్యినట్లు, శాస్త్ర చికిత్సలు తీసుకోని పూర్తిగా కోలుకోవడం కోసం రెండేళ్ల సమయం పట్టిందని తెలియజేసారు.

ఇక తిరిగి వచ్చిన నభా.. వరుస సినిమా అవకాశాలు అందుకుంటున్నారు. ఈక్రమంలోనే ప్రియదర్శి హీరోగా తెరకెక్కుతున్న ‘డార్లింగ్’ సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకున్నారు. ఈ మూవీని నేడు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక ఈ మూవీ అనౌన్స్ చేయడం కోసం.. ప్రమోషన్స్ ని సినిమా థీమ్ కి తగ్గట్లు నిర్వహిస్తూ వచ్చారు. సినిమాలో ప్రియదర్శి, నభా నిత్యం గొడవపడే భార్యాభర్తలుగా నటించబోతున్నారు.

Also read : Nani : జెర్సీ ఐదేళ్ల పురస్కారం.. ఫ్యాన్స్‌కి నాని కొడుకు అర్జున్ ఇచ్చిన బహుమతి.. వీడియో వైరల్..

ఈ థీమ్ తోనే ఇద్దరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో గొడవపడుతూ వచ్చారు. ఇక నేడు మూవీ టైటిల్ ప్రోమో రిలీజ్ ఈవెంట్ లో కూడా స్టేజి పై గొడవ పడుతూ ప్రమోషన్స్ ని నిర్వహించారు. అయితే ఈ ప్రమోషన్స్ చేసే సమయంలో ప్రియదర్శి మాట్లాడుతూ.. “ఈ రెండేళ్లలో నేను ఐదు సినిమాలు తీసుకు వచ్చా. నువ్వు ఒక సినిమా కాదు కదా, సినిమా ఈవెంట్ లో కూడా కనిపించలేదు” అంటూ మాట్లాడారు.

దీనికి నభా రియాక్ట్ అవుతూ.. “సినిమా ప్రమోషన్స్ అని చెప్పి పర్సనల్ గా ఎటాక్ చేస్తున్నారు ఏంటి. ఈ రెండేళ్లలో నాకు ఏం జరిగింది, దాని నుంచి కోలుకోవడం కోసం నేను ఎంత కష్టపడ్డాను అనేది మీకు తెలుసు. అయినా కూడా మీరు ఇలా మాట్లాడతారా” అంటూ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఇది కూడా స్క్రిప్ట్ లో భాగం అని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.