Nani : జెర్సీ ఐదేళ్ల పురస్కారం.. ఫ్యాన్స్‌కి నాని కొడుకు అర్జున్ ఇచ్చిన బహుమతి.. వీడియో వైరల్..

జెర్సీ ఐదేళ్ల పూర్తి చేసుకోవడంతో నాని కొడుకు అర్జున్ ఫ్యాన్స్‌కి ఓ అద్భుతమైన బహుమతి ఇచ్చాడు.

Nani : జెర్సీ ఐదేళ్ల పురస్కారం.. ఫ్యాన్స్‌కి నాని కొడుకు అర్జున్ ఇచ్చిన బహుమతి.. వీడియో వైరల్..

Nani son Arjun play Jersey movie Theme song in piano

Updated On : April 20, 2024 / 3:06 PM IST

Nani : గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా మూవీ ‘జెర్సీ’. 2019లో రిలీజైన ఈ చిత్రానికి నాని ఫ్యాన్స్ లోనే కాదు టాలీవుడ్ లోనే ఓ ప్రత్యేక స్థానం ఉంది. సినిమా పరిశ్రమలో ఫాదర్ సెంటిమెంట్ తో ఎన్నో ఎమోషనల్ డ్రామా చిత్రాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. కానీ వాటిలో జెర్సీ మాత్రం చాలా ప్రత్యేకం. అది కేవలం ఒక తండ్రి కథ మాత్రమే కాదు, సాధించాలని ఉన్నా సాధించడానికి అవకాశం లేని ఎంతోమంది కథ.

అందుకనే టాలీవుడ్ ఆడియన్స్ ఈ సినిమాని బాగా ఓన్ చేసేసుకున్నారు. ఇక ఆ సినిమా మీద ఉన్న ప్రేమతో.. ప్రతి ఏడాది విడుదల తేదీ నాడు జెర్సీ కథని గుర్తు చేసుకుంటూ ఉంటారు. కాగా ఈ ఏడాదితో ఈ సినిమా ఐదేళ్లు పూర్తి చేసుకుంటుంది. దీంతో రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో జెర్సీకి సంబంధించిన సీన్స్ కనిపిస్తూ వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే, జెర్సీ ఫ్యాన్స్ కోసం నాని కొడుకు అర్జున్ ఓ అద్బుతమైన బహుమతి ఇచ్చాడు.

Also read : Bhaje Vaayu Vegam Teaser : కార్తికేయ ‘భజే వాయు వేగం’ టీజర్ రిలీజ్ చేసిన చిరంజీవి..

అర్జున్ సంగీత పాటలు నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. పియానో పై మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తూ టాలీవుడ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల నాని పుట్టినరోజుకి కూడా పియానో పై మ్యూజిక్ ప్లే చేసి బహుమతిని ఇచ్చాడు. నేడు జెర్సీ ఫ్యాన్స్ కోసం పియానో పై జెర్సీ మూవీ థీమ్ సాంగ్ మ్యూజిక్ ని ప్లే చేసి అందర్నీ మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని నాని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ థీమ్ సాంగ్ ని ప్లే చేయడం నిన్నటి నుంచే నేర్చుకోవడం స్టార్ట్ చేశాడట. నేర్చుకోవడం నిన్ననే మొదలుపెట్టిన అర్జున్.. ఆ రేంజ్ లో ప్లే చేయడం చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి అర్జున్ ప్లే చేసిన ఆ థీమ్ సాంగ్ ని మీరు కూడా వినేయండి.

 

View this post on Instagram

 

A post shared by Anjana Yelavarthy (@anjuyelavarthy)