Bhaje Vaayu Vegam Teaser : కార్తికేయ ‘భజే వాయు వేగం’ టీజర్ రిలీజ్ చేసిన చిరంజీవి..
కార్తికేయ ‘భజే వాయు వేగం’ టీజర్ రిలీజ్ చేసిన చిరంజీవి.

Chiranjeevi released Kartikeya Bhaje Vaayu Vegam movie teaser
Bhaje Vaayu Vegam Teaser : టాలీవుడ్ యువహీరో కార్తికేయ గత సంవత్సరం ‘బెదురులంక 2012’ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్దకి మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం నెక్స్ట్ సినిమాని యూవీ క్రియేషన్స్ లో చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేశారు. ‘భజే వాయు వేగం’ అంటూ హనుమంతుడి రిఫరెన్స్‌తో టైటిల్ ని పెట్టారు. నేడు ఈ మూవీ టీజర్ ని చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.
ఒక డ్రగ్స్ కేసులో ఇరుకున్న హీరో లైఫ్ స్టోరీనే సినిమా కథని తెలుస్తుంది. టీజర్ లో ఒక డైలాగ్ చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కడి జీవితంలో ఒకడు ఉంటాడు. వాడి కోసం మనం ఎంత దూరమైనా వెళ్తాము. అలా నా జీవితంలో మా నాన్న.. అంటూ హీరో చెప్పిన డైలాగ్ వింటుంటే సినిమా ఫాదర్ సెంటిమెంట్ తో ఉండబోతుందని తెలుస్తుంది. టీజర్ అయితే షార్ట్ అండ్ సింపుల్ గా బాగుంది.
Also read : Renu Desai : నిన్న అభిమానుల సందేహం.. నేడు రేణూదేశాయ్ క్లారిటీ.. పవన్ కూతురు ఆద్య..
ప్రశాంత్ రెడ్డి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రధన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకు రానున్నారు.