Renu Desai : నిన్న అభిమానుల సందేహం.. నేడు రేణుదేశాయ్ క్లారిటీ.. పవన్ కూతురు ఆద్య..

నిన్న అభిమానుల సందేహం. నేడు వాటికీ క్లారిటీ ఇచ్చేలా రేణుదేశాయ్ క్లారిటీ పోస్ట్. పవన్ కూతురు ఆద్య..

Renu Desai : నిన్న అభిమానుల సందేహం.. నేడు రేణుదేశాయ్ క్లారిటీ.. పవన్ కూతురు ఆద్య..

Renu Desai gave clarity about Pawan daughter aadhya height

Updated On : April 20, 2024 / 3:32 PM IST

Renu Desai : టాలీవుడ్ నటి రేణుదేశాయ్ తన సోషల్ మీడియాలో అకిరా నందన్, ఆద్యకి సంబంధించిన పోస్టులు వేస్తూ పవన్ కళ్యాణ్ అభిమానులను సంతోష పరుస్తుంటారు. రీసెంట్ గా ఆద్య గురించిన ఓ పోస్టుని రేణుదేశాయ్ షేర్ చేశారు. స్కూల్ స్టడీ పూర్తి చేసుకున్న ఆద్య.. గ్రాడ్యుయేషన్ డేకి సంబంధించిన వీడియోని షేర్ చేశారు. ఆ వీడియోలో ఆద్య చాలా హైట్ గా కనిపించింది.

పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా ఆరడగుల కంటే పొడుగు అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే అన్నయ్యతో పాటు చెల్లెలు ఆద్య కూడా ఆరడుగులు హైట్ పెరిగిపోయింది. మొన్నటివరకు తక్కువ హైట్ తో కనిపించిన ఆద్య.. ఆ వీడియోలో చాలా హైట్ గా కనిపించడంతో నెటిజెన్స్ అంతా ఆద్య హైట్ గురించి ప్రశ్నలు వేస్తూ కామెంట్స్ చేశారు. ఆద్య కూడా అకిరాలా హైట్ పెరిగిపోయిందా అంటూ సందేహం వ్యక్తం చేశారు.

Also read : Darling : ప్రభాస్ హిట్ టైటిల్‌తో ప్రియదర్శి నెక్స్ట్ మూవీ.. డార్లింగ్ వై దిస్ కొలవెరి.. ప్రోమో అదుర్స్..

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

మరి ఈ కామెంట్స్ ని రేణుదేశాయ్ చూసారో లేదో తెలియదు గాని, నేడు వాటికీ బదులిచ్చేలా ఓ పోస్ట్ వేశారు. ఆద్యతో దిగిన సెల్ఫీని షేర్ చేస్తూ.. “ఆద్య నాకంటే హైట్ గా ఉంది. నేను 5 అడుగులు 8 అంగుళాలు” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఆద్య కూడా అకిరాలా ఆరడుగులు ఎత్తుకి ఎదిగిపోయిందని ఓ క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

కాగా ఆద్య ఆర్కిటెక్ట్ అవ్వాలని అనుకుంటున్నట్లు రేణుదేశాయ్ గతంలో చెప్పుకొచ్చారు. తాను హౌస్ ఆర్కిటెక్చర్ పై ఇంటరెస్ట్ చూపుతుందని, సినిమా పరిశ్రమలోకి వచ్చే పరిస్థితి లేదని వెల్లడించారు. కాగా రేణుదేశాయ్ కూడా ప్రస్తుతం ఆ ఫీల్డ్ లోనే కొనసాగుతున్నారు.