Darling : ప్రభాస్ హిట్ టైటిల్‌తో ప్రియదర్శి నెక్స్ట్ మూవీ.. డార్లింగ్ వై దిస్ కొలవెరి.. ప్రోమో అదుర్స్..
ప్రభాస్ హిట్ టైటిల్‌తో ప్రియదర్శి నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేశారు. డార్లింగ్ వై దిస్ కొలవెరి అంటూ నభా నటేష్‌తో..

Priyadarshi Nabha Natesh new movie Darling Glimpse
Darling : గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో యాక్టర్ ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేష్ గొడవ పడుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ డార్లింగ్ డైలాగ్స్ తో నభా దబ్ స్మాష్ చేయడం, దానికి ప్రియదర్శి రియాక్ట్ అవుతూ.. నభాని డార్లింగ్ అని పిలవడం, అలా పిలిచినందుకు ఆమె సీరియస్ అవ్వడం. ఇక ఇవన్నీ చూసి అసలు ఈ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందని ఆడియన్స్ తికమక పడడం జరిగింది.
అయితే ఈ గజిబిజి అంతటికి నేడు ఎండ్ కార్డు వేసేసారు. ఇదంతా సినిమా ప్రమోషన్స్ కోసం చేశారు. ప్రియదర్శి, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమా ‘డార్లింగ్’ అనే టైటిల్ ని పెట్టారు. సబ్ టైటిల్ లో ‘వై దిస్ కొలవెరి’ అంటూ రాసుకొచ్చారు. ఈ సినిమా అండ్ టైటిల్ అనౌన్స్ చేస్తూ ప్రోమోని కూడా రిలీజ్ చేశారు.
Also read : Nandamuri Balakrishna : తారకరత్న పిల్లలతో బాలయ్య, మోక్షజ్ఞ.. ఫోటో వైరల్..
భార్యలతో ఇబ్బందులు పడే భర్తల కథే ఈ సినిమా స్టోరీ అని ప్రోమో చూస్తుంటే అర్ధమవుతుంది. తమిళ్ దర్శకుడు అశ్విన్ రామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ప్రభాస్ కల్ట్ మూవీ ‘డార్లింగ్’ టైటిల్ తో వస్తున్న ఈ చిత్రం ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.