Nandamuri Balakrishna : తారకరత్న పిల్లలతో బాలయ్య, మోక్షజ్ఞ.. ఫోటో వైరల్..
తారకరత్న పిల్లలతో బాలయ్య, మోక్షజ్ఞ. అలేఖ్య షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

Nandamuri Balakrishna Mokshagna Teja with Taraka Ratna family
Nandamuri Balakrishna : నందమూరి తారకరత్న చనిపోయిన తరువాత ఆయన కుటుంబ భాద్యతని బాలకృష్ణ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే వారి బాగోగులు చూసుకుంటూ, వారిని అప్పుడప్పుడు కలుస్తూ.. వారికీ తాను ఉన్నానన్న ధైర్యాన్ని ఇస్తూ వస్తున్నారు. తాజాగా కూడా బాలయ్య, తారకరత్న కుటుంబాన్ని కలుసుకున్నారు. బాలయ్యతో పాటు ఆయన తనయుడు మోక్షజ్ఞ కూడా తారకరత్న కుటుంబంతో కనిపించారు.
తారకరత్న పిల్లలతో బాలయ్య, మోక్షజ్ఞ ఉన్న ఫోటోని తారకరత్న భార్య అలేఖ్య తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “నేను ఏ వైపు ఉన్నానని నన్ను ఎప్పుడూ అడుగుతూ వస్తున్నారు. దానికి సమాధానం ఏంటంటే.. మానవత్వం, ప్రేమ, ముఖ్యంగా నా కుటుంబం వైపు ఉన్నాను. మావయ్య (బాలయ్య) మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓబు, పిల్లలు మరియు నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాము” అంటూ పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకొచ్చారు.
Also read : Pushpa 2 : పుష్ప 2 టీజర్‌ని.. ఈ బుడ్డోళ్లు సూపర్‌గా రీ క్రియేట్ చేశారు.. చూస్తే వావ్ అంటారు..
View this post on Instagram
ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక షేర్ చేసిన ఫొటోలో మోక్షజ్ఞ, బాలయ్య, తారకరత్న కుటుంబమంతా కలిసి కనిపించడంతో నందమూరి అభిమానులు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఈ ఫోటోని నెట్టింట షేర్ చేస్తూ తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. మరికొంతమంది బాలయ్యని ప్రశంసలతో అభినందిస్తున్నారు. కొంతమంది మాటవరసకు చెప్పి వదిలేస్తారు. కానీ బాలయ్య.. తారకరత్న కుటుంబం విషయంలో చేస్తున్నది ప్రశంసనీయం అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.