నాగబాబుని ఇరిటేట్ చేసిన బాలయ్య ఫ్యాన్స్

రీసెంట్‌గా చెన్నైలో, ఒక కాలేజ్ ఈవెంట్‌లో నాగబాబు మాట్లాడుతుండగా, బాలయ్య ఫ్యాన్స్, నాగబాబుకి అడ్డు తగిలారు.

  • Published By: sekhar ,Published On : January 5, 2019 / 11:46 AM IST
నాగబాబుని ఇరిటేట్ చేసిన బాలయ్య ఫ్యాన్స్

రీసెంట్‌గా చెన్నైలో, ఒక కాలేజ్ ఈవెంట్‌లో నాగబాబు మాట్లాడుతుండగా, బాలయ్య ఫ్యాన్స్, నాగబాబుకి అడ్డు తగిలారు.

ఎప్పుడూ లేనిది గత కొద్ది రోజులుగా మెగా బ్రదర్ నాగబాబు, సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటున్నాడు. గతంలో నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు అన్నందుకుగానూ, సోషల్ మీడియా సాక్షిగా నాగాబాబు ఎంతలా ఫైర్ అవుతున్నాడో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ రిలీజవబోతుండగా, గాలి అటువైపు మళ్ళించాడు. దీంతో నందమూరి అభిమానులు నాగబాబుపై గుర్రుగా ఉన్నారు. రీసెంట్‌గా చెన్నైలో, ఒక కాలేజ్ ఈవెంట్‌లో నాగబాబు మాట్లాడుతుండగా, బాలయ్య ఫ్యాన్స్, నాగబాబుకి అడ్డు తగిలారు.

స్టేజ్‌పై నాగబాబు మాట్లాడుతుండగా, అభిమానులంతా ఒక్కసారిగా జై బాలయ్య అంటూ అరవడం మొదలు పెట్టారు. అదేం పట్టించుకోకుండా తన స్పీచ్‌ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేసాడు నాగబాబు. అయినా బాలయ్య ఫ్యాన్స్ నాన్‌స్టాప్‌గా, ఇంకా పెద్దగా జై బాలయ్యా అని అరవడంతో, ఏం చెయ్యాలో అర్థంకాక స్టేజ్‌పై నుండి దిగిపోయాడు నాగబాబు. అయిపోయిందేదో అయిపోయింది, ఇకనైనా ఇలాంటి ఇష్యూలను పెద్దవి చెయ్యకుండా ఇక్కడితో ఆపేస్తే బెటర్ అని మెగా, నందమూరి అభిమానులు నాగబాబు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వాచ్ వీడియో…