Nag Ashwin : రెండో సారి తండ్రి కాబోతున్న కల్కి దర్శకుడు.. ఫ్యామిలీ ఫోటో వైరల్..
ప్రస్తుతం నాగ్ ఆశ్వన్ కల్కి 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. (Nag Ashwin)
Nag Ashwin
Nag Ashwin : ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మహానటితో అందర్నీ మెప్పించి కల్కి సినిమాతో స్టార్ దర్శకుడిగా మారారు నాగ్ అశ్విన్. ఎవడే సుబ్రమణ్యం సినిమా సమయంలోనే నిర్మాత అశ్వనీదత్ కూతురు ప్రియాంక దత్ తో ప్రేమలో పడి ఆమెని పెళ్లి చేసుకున్నారు.
2015లో ఈ జంట పెళ్లి చేసుకోగా 2017లో వీరికి ఒక బాబు పుట్టాడు. అతనికి రిషి అని పేరు పెట్టుకున్నారు. తాజాగా నాగ్ అశ్విన్ తన ఫ్యామిలీ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఈ ఫొటోలో ప్రియాంక దత్ బేబీ బంప్ తో కనిపించింది. ఇండైరెక్ట్ గా నాగ్ అశ్విన్ ఈ ఫోటోతో తను రెండో సారి తండ్రి కాబోతున్నట్టు ప్రకటించాడు.
Also See : Sharmiela Mandre : నిర్మాతతో నిశ్చితార్థం చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. ఫొటోలు..
ఈ ఫ్యామిలీ ఫొటోలో నాగ్ అశ్విన్, ప్రియాంక దత్, వాళ్ళ బాబు రిషి, వాళ్ళ పెంపుడు కుక్క ఉన్నారు. దీంతో ఈ ఫ్యామిలీ ఫోటో వైరల్ గా మారగా నాగ్ అశ్విన్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం నాగ్ ఆశ్వన్ కల్కి 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
