Malvika Nair : ఈ హీరోయిన్ లేకుండా కల్కి డైరెక్టర్ సినిమా తీయట్లేదుగా.. నాగ్ అశ్విన్ తీసిన మూడు సినిమాల్లో..
నాగ్ అశ్విన్ ఇప్పటివరకు ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలతో మెప్పించగా ప్రభాస్ కల్కి సినిమాతో త్వరలో పలకరించబోతున్నాడు.

Nag Ashwin Regularly Giving Chances to Actress Malvika Nair
Malvika Nair : కొంతమంది దర్శక నిర్మాతలు కొందరు నటీనటులను రెగ్యులర్ గా తమ సినిమాల్లో తీసుకుంటారు. అది వాళ్ళకి సెంటిమెంట్ అవ్వొచ్చు, లేదా వారి మధ్య ఉన్న స్నేహం అవ్వొచ్చు. ఇలా చాలా మంది డైరెక్టర్స్ తమ సినిమాల్లో కొంతమంది నటినటులకు వరుసగా అవకాశాలు ఇస్తారు. ఇప్పుడు కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఓ హీరోయిన్ కి వరుసగా తన సినిమాల్లో అవకాశం ఇస్తున్నాడు.
నాగ్ అశ్విన్ ఇప్పటివరకు ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలతో మెప్పించగా ప్రభాస్ కల్కి సినిమాతో త్వరలో పలకరించబోతున్నాడు. అయితే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో మెయిన్ హీరోయిన్ మాళవిక నాయర్. ఈ మలయాళ కుట్టి ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతోనే తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నా కమర్షియల్ బ్రేక్ మాత్రం ఇప్పటికి రాలేదు.
Also Read : Sonakshi Sinha – Zaheer Iqbal : బాలీవుడ్ కొత్త జంట.. ఎంత క్యూట్‌గా డ్యాన్స్ వేస్తున్నారో..
ఎవడే సుబ్రహ్మణ్యం నాగ్ అశ్విన్ మొదటి సినిమా. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ మహానటిలో కూడా మాళవిక నాయర్ ఓ ముఖ్య పాత్ర చేసింది. ఇప్పుడు కల్కి సినిమాలో కూడా మాళవిక నాయర్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇటీవల రిలీజ్ చేసిన కల్కి ట్రైలర్ లో మాళవిక నాయర్ కనిపించింది. దీంతో ఈ హీరోయిన్ లేకుండా కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమా చేసేలా లేడుగా అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మాళవిక నాగ్ అశ్విన్ మొదటి సినిమా హీరోయిన్ కావడంతో ఆ స్నేహంతోనే తన ప్రతి సినిమాలో అవకాశం ఇస్తున్నట్టు భావిస్తున్నారు.