Naga Chaitanya- Sobhita Dhulipala : ఘనంగా హీరో నాగచైతన్య-శోభితల వివాహం..

హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్లల‌ పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది.

Naga Chaitanya And Sobhita Dhulipala Wedding pics Goes Viral

హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్లల‌ పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది. హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా వీరిద్ద‌రి వివాహం జ‌రిగింది. హిందూ సాంప్రదాయం ప్రకారం స‌రిగ్గా రాత్రి 8.15 నిమిషాల‌కు శోభిత మెడ‌లో చెత‌న్య మూడు ముడులు వేశాడు.

ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు స‌మ‌క్షంలో వివాహ‌బంధంలోకి అడుగుపెట్టారు. వీరి వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంకటేష్, టీ సుబ్బరామి రెడ్డి, చాముండేశ్వరి నాథ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అరవింద్, రానా దగ్గుబాటి, సుహాసిని, కీరవాణి తదితరులు హాజ‌ర‌య్యారు.

Pushpa 2 : పుష్ప 2 మూవీకి బిగ్ షాక్.. మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ షోలు ర‌ద్దు..

కాగా.. వీరిద్ద‌రి పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. కొత్త జంట‌కు నెటిజ‌న్లు శుభ‌కాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.