Pushpa 2 : పుష్ప 2 మూవీకి బిగ్ షాక్.. మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ షోలు ర‌ద్దు..

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ న‌టించిన మూవీ ‘పుష్ప 2’.

Pushpa 2 : పుష్ప 2 మూవీకి బిగ్ షాక్.. మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ షోలు ర‌ద్దు..

Big shock to Pushpa 2 movie in karnataka

Updated On : December 4, 2024 / 7:31 PM IST

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ న‌టించిన మూవీ ‘పుష్ప 2’. సుకుమార్ దర్శకత్వంలో ఈ మూవీ తెర‌కెక్కింది. రష్మిక హీరోయిన్‏గా నటించ‌గా దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ వ్యాప్తంగా ఈ సినిమా విడుద‌ల‌కు ఒక రోజు ముందుగానే అంటే డిసెంబర్ 4 నుండే ప్రీమియర్స్ మొదలు కాబోతున్నాయి.

Seize The Ship : ప‌వ‌న్ డైలాగే టైటిల్ అంట..? ‘సీజ్ ద షిప్’ టైటిల్‌ను రిజిస్ట్రేషన్ చేసుకున్న నిర్మాణ సంస్థ..

అయితే.. క‌ర్ణాట‌క‌లో పుష్ప 2 మూవీకి షాక్ త‌గిలింది. బెంగళూరులో ‘పుష్ప-2’ మూవీ మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ షోలు ప్రదర్శించవద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసారు. ఉదయం 6 గంటలకు ముందు షోలు ప్రదర్శించడం చట్టవిరుద్ధమని కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూసర్ల ఫిర్యాదు చేశారు.

దీంతో క‌లెక్ట‌ర్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.

Pushpa 2 Collections : పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వస్తాయి? ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 100 కోట్లు..