Seize The Ship : పవన్ డైలాగే టైటిల్ అంట..? ‘సీజ్ ద షిప్’ టైటిల్‌ను రిజిస్ట్రేషన్ చేసుకున్న నిర్మాణ సంస్థ..
తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో సీజ్ ద షిప్ అనే టైటిల్‌ను ఓ నిర్మాత రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

R Film factory registered the Title Seize The Ship
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల కిందట కాకినాడ పోర్టులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని గుర్తించారు. ఈ క్రమంలో బియ్యాన్ని తరలిస్తున్న పనామా దేశానికి చెందిన ‘స్టెల్లా ఎల్’నౌకను సీజ్ చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.
ఈ క్రమంలో సీజ్ ద షిప్ అనే పదాన్ని వాడారు. ఈ పదం ట్రెండింగ్ గా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో సీజ్ ద షిప్ అనే టైటిల్‌ను ఓ నిర్మాత రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
PaPa : మారుతీ చేతుల మీదుగా ‘పా.. పా..’ ట్రైలర్ రిలీజ్.. తమిళ్ సూపర్ హిట్ ‘డా..డా’ తెలుగులో..
టాలీవుడ్‌కు చెందిన ఆర్ ఫిలిం ఫ్యాక్టరీ.. ‘సీజ్ ద షిప్’ అనే టైటిల్‌ను రూ.1100లకు నమోదు చేసుకుంది. ప్రస్తుతం ఇది ఫిలిం సర్కిల్‌లో హాట్ టాఫిక్ గా మారింది. పవన్ క్రేజ్ అంటే ఇదేనంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
Trend setter @PawanKalyan 😌#SeizeTheShip pic.twitter.com/7rmtD6876H
— Vijay kalyan cult (@VijayKalyanCult) December 4, 2024