PaPa : మారుతీ చేతుల మీదుగా ‘పా.. పా..’ ట్రైలర్ రిలీజ్.. తమిళ్ సూపర్ హిట్ ‘డా..డా’ తెలుగులో..
తమిళ్ లో పెద్ద హిట్ అయిన ‘డా..డా’ సినిమా ఇప్పుడు తెలుగులో రిలీజ్ కానుంది.

Kavin Dubbing Movie PaPa Trailer Released by Director Maruthi
PaPa Movie Trailer : తమిళ్ లో పెద్ద హిట్ అయిన ‘డా..డా’ సినిమా ఇప్పుడు తెలుగులో రిలీజ్ కానుంది. కవిన్, అపర్ణ దాస్ జంటగా డైరెక్టర్ గణేష్ కె బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘డా..డా’ తెలుగులో ‘పా.. పా..’ టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. జెకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత నీరజ కోట ఈ సినిమాను విడుదల చేయనున్నారు. డిసెంబర్ 13న ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది.
Also Read : Unstoppable 4 : ముసలి వేషంలో బాలయ్య.. ఆదిత్య 369 సీక్వెల్ గురించి ఏమన్నారంటే?
తమిళ్ లో తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆల్మోస్ట్ 30 కోట్లు వసూలు చేసి పెద్ద విజయం సాధించింది. తండ్రి కొడుకుల సెంటిమెంట్‌తో పాటు ప్రేమ ఎమోషన్, రొమాంటిక్ కామెడీతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను రాజాసాబ్ డైరెక్టర్ మారుతి రిలీజ్ చేసారు. మీరు కూడా ట్రైలర్ చూసేయండి..
ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. తమిళ్ హిట్ సినిమా ‘డా..డా’ ఇప్పుడు తెలుగులో ‘పా.. పా..’గా రిలీజ్ అవ్వడం సంతోషంగా ఉంది. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది. ఈ సబ్జెక్ట్ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది అని అన్నారు.