Naga Chaitanya and Sobhita Dhulipala wedding will be sold to an OTT platform are completely false
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య, నటి శోభిత దూళిపాళ్ల త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి వివాహం డిసెంబర్ 4న జరగనుంది. పెళ్లిని సింపుల్‌గానే చేసుకోవాలని నాగచైతన్య అనుకుంటున్నట్లుగా ఇటీవల నాగార్జున చెప్పిన విషయం తెలిసిందే. పెళ్లి పనులు, అతిథుల జాబితా వంటి విషయాలను నాగచైతన్య, శోభితలు దగ్గరుండి చూసుకుంటున్నట్లు కింగ్ చెప్పారు.
అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగా వేదికను సిద్ధం చేస్తున్నట్లు చైతూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు కూడా. కాగా.. వీరి పెళ్లి వేడుకలను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇలా ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో షేర్ చేయకుండా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫిక్స్‌లో విడుదల చేసేలా ఒప్పందం చేసుకున్నారట. ఇందుకోసం నెట్‌ఫ్లిక్స్ రూ.50 కోట్లు చెల్లించనుందనేది సదరు వార్తల సారాంశం.
Subbaraju : పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజు.. వధువు ఎవరంటే?
ఈ కథనాలపై చైతు టీమ్ స్పందించింది. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా పెళ్లి తంతు నిర్వహించాలనే ఉద్దేశంలో కొత్త జంట ఉందని తెలిపింది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య తండేల్ మూవీలో నటిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండగా అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నివాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తరువాత చైతు విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మూవీలో నటించనున్నారు.
Nikhil : సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిని నిఖిల్ కొత్త మూవీ.. రిలీజైన 20 రోజులకే..