Naga Chaitanya : స్పోర్ట్స్ ఫీల్డ్‌లోకి నాగచైతన్య ఎంట్రీ.. బ్లాక్ బర్డ్‌కి ఓనర్‌గా..

ఇప్పటి వరకు సినీ పరిశ్రమలో కొనసాగుతూ వచ్చిన చైతన్య.. ఇప్పటినుంచి స్పోర్ట్స్ ఫీల్డ్‌లోకి కూడా అడుగు పెట్టబోతున్నాడు.

Naga Chaitanya becoming owner for Hyderabad Blackbirds

Naga Chaitanya : టాలీవుడ్ లో నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక పక్క హీరోగా నటిస్తూనే, మరో పక్క బిజినెస్ మెన్ గా కూడా రాణిస్తుంటాడు. తాజాగా ఇప్పుడు ఆయన తనయుడు నాగచైతన్య కూడా అదే బాటలో కొనసాగనున్నాడు. ఇప్పటి వరకు సినీ పరిశ్రమలో కొనసాగుతూ వచ్చిన చైతన్య.. ఇప్పటినుంచి స్పోర్ట్స్ ఫీల్డ్‌లోకి కూడా అడుగు పెట్టబోతున్నాడు. నాగచైతన్య ముందు నుంచి కారు రేసింగ్ పై ఆసక్తి ఉండడంతో.. ఒక రేసింగ్ టీంకి ఓనర్ గా భాద్యతలు తీసుకుంటున్నాడు.

Jr NTR : చంద్రబాబు‌పై స్పందించని ఎన్టీఆర్.. అవార్డు కోసం దుబాయ్‌కి..

హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ (Hyderabad Blackbirds) టీంతో ఇండియన్ రేసింగ్ లీగ్ అండ్ F4 ఇండియన్ ఛాంపియన్‌షిప్ లో పాల్గొనబోతున్నాడు. ఇక మోటార్ స్పోర్ట్ లో నాగచైతన్య ఎలాంటి సక్సెస్ ని అందుకుంటాడో చూడాలి. ఇక ఈ విషయం తెలుసుకున్న అక్కినేని అభిమానులు.. ఈ రేసింగ్ గురించి, కారుల గురించి నెట్టింట తెగ సెర్చ్ చేసేస్తున్నారు.

ఇక నాగచైతన్య నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం చందూ ముండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడు. ఈ చిత్రాన్ని ఒక రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించబోతున్నారు. 2018లో గుజరాత్ విరావల్ నుండి వేటకెళ్లిన 21 మంది మత్స్యకారులు అనుకోకుండా పాక్ (Pakistan) కోస్ట్ గార్డ్‌కి చిక్కారు. అలా చిక్కిన వారిలో కె మత్స్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకారుడు గణగల్ల రామరావు కథని ఆధారంగా తీసుకోని లవ్ స్టోరీగా తెరకెక్కించబోతున్నారు.

బన్నీ వాసు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల నాగచైతన్య.. గణగల్ల రామరావుని కూడా కలుసుకున్నాడు.