Site icon 10TV Telugu

Naga Chaitanya : ఆ విషయంలో మా నాన్న తప్పేమి లేదు.. నాగార్జున పై నాగచైతన్య కామెంట్స్!

Naga Chaitanya comments on nagarjuna in recent interview

Naga Chaitanya comments on nagarjuna in recent interview

Naga Chaitanya : అక్కినేని హీరో నాగచైతన్య నటించిన కస్టడీ (Custody) సినిమా రిలీజ్ కి సిద్ధమైంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతుండడంతో రెండు చోట్ల ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే చైతన్య ఇటీవల ఒక తెలుగు మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో తన తండ్రి నాగార్జున గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అక్కినేని వారసులైన చైతన్య, అఖిల్ కెరీర్ ని నాగార్జున సరిగా పట్టించుకోవడంలేదని అక్కినేని అభిమానుల్లో కొంత అసంతృప్తి ఉంది.

Naga Chaitanya: ఆ డైరెక్టర్ వల్ల టైమ్ వేస్ట్ అంటోన్న చైతూ.. ఎవరో తెలుసా?

ఈ విషయానే ఆ ఇంటర్వ్యూలో ప్రస్తావించగా నాగచైతన్య క్లారిటీ ఇచ్చాడు. అలాంటిది ఏమి లేదని, తన తండ్రి పై ఆధారపడి కాకుండా తమ నిర్ణయాలతో తమకి తాముగా ఎదగాలనే ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఆ విషయంలో నాగార్జున తప్పేమి లేదని తెలియజేశాడు. నిజానికి నాగార్జున చాలాసార్లు చైతన్య అండ్ అఖిల్‌ని.. మీకు ఏ డైరెక్టర్ తో పని చేయాలని ఉందో చెప్పండిరా వాళ్ళకి అడ్వాన్స్ పంపిస్తాను అని అడిగాడట. ఇప్పటికి ఇప్పుడు నాగచైతన్య గాని అఖిల్ గాని పలానా డైరెక్టర్ తో పని చేయాలని ఉందని నాగార్జునకు చెబితే వెంటనే కారు వేసుకొని ఆ దర్శకుడి ఆఫీస్ కి వెళ్లి సినిమా సెట్ చేస్తాడని చెప్పుకొచ్చాడు.

Naga Chaitanya : సమంత మంచి అమ్మాయి.. ఆమె సంతోషంగానే ఉండాలి.. నాగచైతన్య కామెంట్స్!

ఇక కస్టడీ విషయానికి వస్తే.. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్నాడు. కృతి శెట్టి మరోసారి నాగచైతన్యకు జంటగా కనిపించబోతుంది. అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి, సంపత్ రాజ్, వెన్నల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. మే 12న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ పై అక్కినేని అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.

Exit mobile version