సచిన్ అవుతావా- సోంబేరవుతావా?
లవర్స్ డే కానుకగా మజిలీ టీజర్ రిలీజ్ అయ్యింది..

లవర్స్ డే కానుకగా మజిలీ టీజర్ రిలీజ్ అయ్యింది..
పెళ్ళి తర్వాత యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న సినిమా.. మజిలీ.. దేర్ ఈజ్ లవ్, దేర్ ఈజ్ పెయిన్.. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్‌లో, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై, సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. లవర్స్ డే కానుకగా మజిలీ టీజర్ రిలీజ్ అయ్యింది.. నీకో సంవత్సరం టైమిస్తున్నాను, ఈలోగా నువ్వు సచినే అవుతావో.. సోంబేరవుతావో నీ ఇష్టం.. అనే రావు రమేష్ వాయిస్ ఓవర్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది.
చైతు వాల్తేరు గ్రౌండ్‌లో క్రికెట్ ఆడడం, దివ్యాంశతో లవ్, మందు, మాణిక్ చంద్, సమంత అతని లైఫ్‌లోకి రావడం.. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది టీజర్.. చై, క్లీన్ షేవ్, గెడ్డంతో.. డిఫరెంట్‌గా ఉన్నాడు. సమంత చీరకట్టులో హౌస్‌వైఫ్‌లా ఆకట్టుకుంది.. దివ్యాంశ క్యూట్‌గా ఉంది.. వెధవలకెప్పుడూ మంచి పెళ్ళాలు దొరుకుతారని నువ్వే ప్రూవ్ చేసావ్ అంటూ .. పోసాని వాయిస్ వినిపిస్తుండగా, వర్షంలో సిగరెట్ వెలిగించుకుంటున్న చైతన్యకి, సమంత గొడుగు పట్టడంతో టీజర్ ఎండ్ అవుతుంది.
ప్రేమ, పెళ్ళి తర్వాత భార్య, భర్తల మధ్య వచ్చే మనస్పర్థలు వంటి ఎమోషన్స్ హైలెట్‌గా మజిలీ తెరకెక్కుతుందని తెలుస్తుంది.. విష్ణు శర్మ విజువల్స్, గోపీ సుందర్ ఆర్ ఆర్ బాగున్నాయి.. ఏప్రిల్ 5 న మజిలీ విడుదలవుతుంది.
వాచ్ టీజర్…