Naga Chaitanya : బాబోయ్.. శోభితని తెగ పొగిడేసిన చైతూ.. ప్రతిదీ తనని అడిగాకే..

నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో శోభిత గురించి మాట్లాడుతూ పొగిడేసాడు.

Naga Chaitanya Praises about his Wife Sobhita Dhulipala in Thandel Promotions

Naga Chaitanya : నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఫిబ్రవరి 7న ఈ సినిమా రిలీజవుతుంది. ఇటీవల బాలీవుడ్ లో కూడా ఈ సినిమా ప్రమోషన్స్ చేసారు. ఈ క్రమంలో నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో శోభిత గురించి మాట్లాడుతూ పొగిడేసాడు.

Also Read : Priyanka Chopra : వామ్మో.. మహేష్ రాజమౌళి సినిమాకు ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఫస్ట్ టైం ఒక హీరోయిన్ కి ఆ రేంజ్ లో..

నాగచైతన్య శోభిత గురించి మాట్లాడుతూ.. శోభితతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. నా ఆలోచనలు అన్ని ఆమెకు చెప్తాను. నేను ఎప్పుడైనా గందరగోళానికి గురైతే ఆమెనే అడుగుతాను. నేను కాస్త ఒత్తిడికి లోనయినా తనకు తెలిసిపోతుంది. ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది. అన్ని విషయాల్లో మంచి సలహాలు, సూచనలు ఇస్తుంది. ఆమె అభిప్రాయాలు బాగుంటాయి. ఆమె నిర్ణయాలను నేను గౌరవిస్తాను. నేను ప్రతిదీ ఆమె నిర్ణయం తీసుకున్నాకే మొదలుపెడతాను. ఆమెతో జీవితం సంతోషంగా ఉంది అని తెలిపాడు.

Also Read : Salman Khan : యాక్సిడెంట్‌కి గురైన సల్మాన్ చెల్లి.. హాస్పిటల్ బెడ్ పై దీన స్థితిలో.. నాలుగు రోజులవుతున్నా స్పందించని సల్మాన్..

దీంతో చైతూ కామెంట్స్ వైరల్ గా మారాయి. నాగచైతన్య సమంతతో విడాకుల తర్వాత శోభితని రెండేళ్లు ప్రేమించి ఇటీవలే డిసెంబర్ 4న సింపుల్ గా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి తర్వాత ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా ఒకరి గురించి ఒకరు గొప్పగా చెప్తున్నారు. చైతూ – శోభిత ఇద్దరూ ప్రస్తుతం తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మాణంలో నాగచైతన్య – సాయి పల్లవి జంటగా తెరకెక్కిన తండేల్ సినిమా జనవరి 7న రిలీజ్ కానుంది. శ్రీకాకుళంకు చెందిన కొంతమంది మత్స్యకారుల జీవిత కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.