Naga Chaitanya : కాబోయే భార్య శోభితతో ఫస్ట్ ఫొటో షేర్ చేసిన నాగచైతన్య..!

Naga Chaitanya : గ్రే టీషర్ట్ మీద బ్లాక్ లెదర్ జాకెట్‌లో చైతూ కనిపించగా, శోభిత స్లీవ్‌లెస్ బ్లాక్ టాప్‌తో పాటు భారీ బ్యాగీ జీన్స్‌తో మెరిసింది.

Naga Chaitanya shares first pic with Sobhita Dhulipala

Naga Chaitanya : టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. గత ఆగస్టు 8నే వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు చైతూ, శోభితతో ఎంగేజ్‌మెంట్ జరిగిన తర్వాత తామిద్దరూ కలిసి దిగిన ఫస్ట్ ఫొటోను షేర్ చేశాడు. ఈ పోస్టులో తన కాబోయే భార్య శోభితాతో నాగచైతన్య ఇద్దరూ బ్లాక్ డ్రెస్సులో జంటగా కనిపించారు. గ్రే టీషర్ట్ మీద బ్లాక్ లెదర్ జాకెట్‌లో చైతూ కనిపించగా, శోభిత స్లీవ్‌లెస్ బ్లాక్ టాప్‌తో పాటు భారీ బ్యాగీ జీన్స్‌తో మెరిసింది.

ఎలివేటర్‌లో అద్దం వైపు చూస్తూ వారిద్దరూ బ్లాక్ షేడ్స్ ధరించి ఉన్నారు. నాగచైతన్య పోస్టు చేసిన ఈ ఫొటోకు కామెంట్స్ డిసేబుల్ చేసినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎంగేజ్‌మెంట్‌కు ముందు దాదాపు 3 ఏళ్ల నుంచి నాగ చైతన్య, శోభిత డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు వచ్చాయి. చాలా రోజుల తర్వాత వీరిద్దరూ కలిసి దిగిన క్రేజీ ఫోటోను చైతూ షేర్ చేశాడు.

కాబోయే భార్య శోభితతో కలిసి ఉన్న చైతూ ఫొటోలో చాలా స్టైలిష్ గా కనిపించారు. ‘ప్రతీచోటా మొత్తం ఒకేసారి’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు నాగచైతన్య.. కొత్తగా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట సంప్రదాయ దుస్తులు ధరించిన ఫోటోలు కూడా కనిపించాయి. చైతన్య ఆఫ్-వైట్ కుర్తా-పైజామాలో కనిపించగా, శోభిత గులాబీ చీరలో మెరిసిపోతూ కనిపించింది.

Read Also : 1980s Radhe Krishna : ‘1980లో రాధేకృష్ణ’ మూవీ రివ్యూ.. తెలుగు, బంజారా భాషల్లో..