Naga Chaitanya : అతిథిగా సడన్ ఎంట్రీ ఇచ్చి.. అభిమానులను సర్‌ప్రైజ్ చేసిన నాగచైతన్య..
దూత ప్రమోషన్స్ లో భాగంగా అతిథిగా అభిమానుల ఇంటికి సడన్ ఎంట్రీ ఇచ్చి సర్‌ప్రైజ్ చేస్తున్నారు.

Naga Chaitanya surprise his fans with sudden entry for their places
Naga Chaitanya : అక్కినేని హీరో నాగచైతన్య తన కొత్త ప్రాజెక్ట్స్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ‘దూత’ వెబ్ సిరీస్ తో నెక్స్ట్ వీక్ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. విక్రమ్ కే కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో నాగ చైతన్య ఒక విలేకరిగా కనిపించబోతున్నారు. ఇప్పుడు వరకు సినిమాల్లో కనిపించిన చైతన్యకి.. ఈ సిరీస్ లో చైతన్యకి చాలా డిఫరెన్స్ ఉంటుందని నాగచైతన్య చెప్పుకొస్తున్నారు.
డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్(Amazon Prime) ఓటీటీలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్ లో ఉన్న నాగచైతన్య టాలీవుడ్ టు బాలీవుడ్ సందడి చేస్తూ కనిపిస్తున్నారు. తాజాగా ఈ హీరో అభిమానుల ఇంటికి అతిథిగా, వారు ఉన్న చోటుకి సడన్ ఎంట్రీ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
ఆ వీడియోని ఒక యూట్యూబర్ తో కలిసి నాగచైతన్య చిత్రీకరించారు. ఈ నెల 23న చైతన్య బర్త్ డే ఉన్న సంగతి తెలిసిందే. నాగచైతన్యకి బర్త్ డే విషెస్ తెలియజేయాలంటే ఎలా చేస్తారు అని యూట్యూబర్ ప్రశ్నించడం, అభిమానులు చెబుతున్న సమయంలో నాగచైతన్య ఎంట్రీ ఇచ్చి సర్‌ప్రైజ్ చేయడం ఆ వీడియోలో కనిపిస్తుంది. అలా వచ్చిన చైతన్య వారితో కలిసి సరదాగా మాట్లాడడమే కాకుండా వెళ్లే అప్పుడు ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చారు.
Also read : Actress Amani : తమిళ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేశాను.. నటి ఆమని సంచలన వ్యాఖ్యలు
View this post on Instagram
ఇక నాగచైతన్య సినిమాల విషయానికి వస్తే.. చందూ మొండేటి దర్శకత్వంలో NC23 సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా యదార్ధ సంఘటనలు ఆధారంగా తెరకెక్కుతుంది. గీతాఆర్ట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా, చాలా కాలం తరువాత భారీ ఖర్చుతో ఈ సినిమాని నిర్మించబోతోంది. డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుందని సమాచారం.