Actress Amani : తమిళ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేశాను.. నటి ఆమని సంచలన వ్యాఖ్యలు
నటి ఆమని తన సహజ నటనతో 90 లలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ బిజీగా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం ఆమని క్యాస్టింగ్ కౌచ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Actress Amani
Actress Amani : సీనియర్ నటి ఆమని గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ‘జంబలకిడి పంబ’ సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చిన ఆమని స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. కొద్దిరోజుల క్రితం ఈ నటి క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. తమిళ్ ఇండస్ట్రీలో తను ఫేస్ చేసానంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Saindhav : వాటిని ‘రాంగ్ యూసేజ్’ చేయొద్దు అంటున్న వెంకీ మామ.. ‘సైంధవ్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్..
నటి ఆమని ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈవీవీ సత్యనారాయణ సినిమా జంబ లకిడి పంబ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మిస్టర్ పెళ్లాం, శుభలగ్నం, శుభ సంకల్పం వంటి అద్భుతమైన సినిమాల్లో నటించారు. రెండు సార్లు నంది అవార్డులు కూడా అందుకున్నారామె. తెలుగుతో పాటు తమిళం, కన్నడ చిత్రాల్లో నటించిన ఆమని పెళ్లి చేసుకున్నాక కొంతకాలం సినిమాలకు దూరమయ్యారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో మిడిల్ క్లాస్ అబ్బాయి, హలో గురు ప్రేమ కోసమే, చావు కబురు చల్లగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, వినరో భాగ్యము విష్ణు కథ సినిమాల్లో నటించారు. అయితే కొద్దిరోజుల క్రితం మీడియాతో మాట్లాడిన ఆమని తను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఎదుర్కున్న కష్టాలు ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసారు.
సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఫోటోలు చూసి పిలిచేవారని.. తీరా వెళ్లేసరికి ఈ అమ్మాయా? అని పెదవి విరిచేవారని ఆమని చెప్పారు. కలర్ తక్కువగా ఉండటం వల్లే తను చాలా సినిమాల్లో రిజెక్ట్ అయినట్లు అన్నారామె. రంగు చూసి తనకు టాలెంట్ ఉందో లేదో అనే అనుమానంతో మళ్లీ పిలుస్తామని చెప్పి పంపించేసేవారని ఆ విషయం తనను ఎంతగానో బాధించేదని ఆమని గుర్తు చేసుకున్నారు.
తెలుగులో కంటే తమిళంలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉండేదని.. తను ఫేస్ చేశానని చెప్పారు ఆమని. సినిమా అవకాశం కోసం పిలిచినపుడు ‘టూ పీసెస్ దుస్తులు ధరించాలి.. స్ట్రెచ్ మార్కులు ఏమైనా ఉన్నాయా? ఒకసారి బట్టలు విప్పి చూపిస్తారా? ‘వంటి ప్రశ్నలు కొందరు తనను అడిగారని చెప్పారు ఆమని. ఏదైనా సినిమా ఒప్పుకుని అడ్వాన్స్ కూడా తీసుకున్న రెండు రోజుల తర్వాత మేనేజర్ వచ్చి డైరెక్టర్ గారో.. ఫైనాన్సరో మిమ్మల్ని ఓసారి బీచ్ దగ్గరకు రమ్మంటున్నారని పిలిచేవాడని.. ఒంటరిగా రమ్మని అడగటంతో విషయం అర్ధమై పోయేదని ఆమని అన్నారు. ఏ రంగంలో అయినా ఇలాంటి పరిస్థితులు ఉంటాయని మంచి, చెడు ఎంపిక చేసుకోవడం అనేది మన చేతుల్లో ఉంటుందని ఆమె అన్నారు. క్యాస్టింగ్ కౌచ్‌పై ఆమని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.