Hi Nanna – Kannappa : ‘హాయ్ నాన్న’ ట్రైలర్ రిలీజ్ డేట్.. ‘కన్నప్ప’ బర్త్ డే అప్డేట్.. ప్రభాస్ పోస్టర్..!
'హాయ్ నాన్న' ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నాని. బర్త్ డేకి 'కన్నప్ప' అప్డేట్ అంటున్న మంచు విష్ణు. ప్రభాస్ పోస్టర్..!

Nani Hi Nanna Manchu Vishnu Kannappa movie latest updates
Hi Nanna – Kannappa : నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా కొత్త దర్శకుడు శౌర్యువ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఎమోషనల్ డ్రామా మూవీ ‘హాయ్ నాన్న’. జెర్సీ మూవీ తరువాత నాని నుంచి వస్తున్న మరో ఫాదర్ సెంటిమెంట్ మూవీ ఇది. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని నాని దగ్గరుండి నడిపిస్తున్నారు. రెగ్యులర్ ప్రమోషన్స్ తరహాలో కాకుండా కొంచెం క్రేజీగా ఆలోచించి పేరెంట్స్ మీటింగ్, పొలిటికల్ పార్టీ మీటింగ్స్ అంటూ..నాని ప్రమోషన్స్ తోనే ఆడియన్స్ ని అలరిస్తున్నారు.
ఆల్రెడీ ఈ సినిమా మ్యూజికల్ జర్నీ మొదలుపెట్టిన మూవీ టీం.. ఇప్పటికే మూడు సాంగ్స్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. తాజాగా ఇప్పుడు సినిమా ట్రైలర్ రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల 24న ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు నాని అనౌన్స్ చేశారు. రెండున్నర నిముషాలు పాటు ఉండే ఈ ట్రైలర్ ని తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు.
View this post on Instagram
ఇక మంచు విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ విషయానికి వస్తే.. న్యూజిలాండ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సింగల్ షెడ్యూల్ పూర్తి చేసేలా మేకర్స్ అంతా సిద్ధం చేసుకొని న్యూజిలాండ్ వెళ్లారు. కాగా నవంబర్ 23న మంచు విష్ణు పుట్టినరోజు ఉంది. దీంతో ఆ రోజున ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు విష్ణు తెలియజేశారు.
ఈ గురువారం తెల్లవారుజామున 2:45 నిమిషాలకు ఈ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు మంచు విష్ణు తెలియజేశారు. అయితే ఈ అప్డేట్ ఏంటనేది ఒక క్లారిటీ ఇవ్వలేదు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ ‘శివుడి’గా భక్త కన్నప్పగా మంచు విష్ణు కనిపించబోతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్, విష్ణుతో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేస్తారా..? అనే ఒక క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. మరి ఆ అప్డేట్ ఏంటో చూడాలి.
Nov 23rd!
2.45am Indian Standard time
10.15am New Zealand Daylight time#Kannappa #HarHarMahadev— Vishnu Manchu (@iVishnuManchu) November 21, 2023