Naga Chaitanya
Naga Chaitanya: మన తెలుగు హీరోలు ఇప్పుడు నేషనల్ వైడ్ మార్కెట్ పెంచుకొనే పనిలో ఉన్నారు. పొరుగు రాష్ట్రాల దర్శకులు కూడా మన హీరోలు ఒక్క అవకాశం ఇస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. తారక్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు పాన్ ఇండియా స్టార్స్ అయ్యే ప్రయత్నాల్లో ఉంటే.. ఆ తర్వాత హీరోలు నానీ, రామ్, నాగ చైతన్య లాంటి హీరోలు దక్షణాదిలో పాగా వేసేందుకు ట్రై చేస్తున్నారు.
నానీ ఇప్పటికే శ్యామ్ సింగరాయ్ సినిమాతో దక్షణాది స్టార్ గా మారగా.. రామ్ సౌత్ సినిమాగా తమిళ దర్శకుడు లింగుస్వామితో జతకట్టి ది వారియర్ తో రాబోతున్నాడు. ఇప్పుడు అదే బాటలో నాగ చైతన్య కూడా ఓ తమిళ దర్శకుడితో బైలింగ్వల్ సినిమా చేసేందుకు సిద్దమయ్యాడు. కోలీవుడ్ లో విలక్షణ దర్శకుడిగా వెంకట్ ప్రభుకి మంచి పేరుంది. ‘గోవా’, ‘సరోజ’, ‘గ్యాబ్లింగ్’, ‘రాక్షసుడు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు వెంకట్ పరిచయమే.
తాజాగా శింబు హీరోగా తెరకెక్కించిన టైం లూప్ కాన్సెప్ట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘మానాడు’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోగా.. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులు దక్కించుకుంది. కాగా.. వెంకట్ ప్రభు దర్శకత్వంలోనే నాగ చైతన్య హీరోగా ఓ సినిమా చర్చలు జరుగుతున్నాయట. వెంకట్ ప్రభు చాలాకాలంగా తెలుగులో సినిమా కోసం ప్రయత్నిస్తుండగా.. చైతూ కూడా తమిళంలో మార్కెట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. దీంతో ఈ ఇద్దరూ కలిసి ద్విభాషా సినిమా చేయబోతున్నారు.
తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు వెంకట్ ప్రభు ఓ ఇంటర్వ్యూలో అధికారికంగా వెల్లడించారు. ఈ మూవీలో చైతూ సరసన హీరోయిన్‌గా బుట్టబొమ్మ పూజా హెగ్డేను పరిశీలిస్తున్నారట. పూజాహెగ్డే తెలుగు డెబ్యూ మూవీ ఒక లైలా కోసంతో చైతూ పూజాకి మంచి ర్యాపో ఉండగా ఈ కాంబినేషన్ మరోసారి సెట్ కావడం గ్యారంటీగా కనిపిస్తుంది. అదే జరిగితే చైతూ మరోసారి తమిళంలో మార్కెట్ పెంచుకోవడంతో పాటు మరో తమిళ దర్శకుడు తెలుగుకు పరిచయం కావడం పక్కాగా కనిపిస్తుంది.