Naga Manikanta : గంగవ్వకు బంగారం.. రోహిణికి ముద్దు.. హౌస్ లో ఉండటానికి నాగ మణికంఠ బాగానే ప్లాన్ చేస్తున్నాడుగా..

హౌస్ లో మొదట్లో రోజు ఏడుస్తూ ఆ తర్వాత హగ్గులు ఇస్తూ బాగా వైరల్ అయ్యాడు నాగమణికంఠ.

Naga Manikanta : గంగవ్వకు బంగారం.. రోహిణికి ముద్దు.. హౌస్ లో ఉండటానికి నాగ మణికంఠ బాగానే ప్లాన్ చేస్తున్నాడుగా..

Naga Manikanta Planning to stay in Bigg Boss House Recent Comments goes Viral

Updated On : October 17, 2024 / 9:14 AM IST

Naga Manikanta : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఏడో వారం సాగుతుంది. ఇప్పటికే నామినేషన్స్ అయిపోగా టాస్కులు నడుస్తున్నాయి. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ అంతా వాళ్ళ టీమ్స్ తో కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. ఈ క్రమంలో నాగమణికంఠ గంగవ్వకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు.

హౌస్ లో మొదట్లో రోజు ఏడుస్తూ ఆ తర్వాత హగ్గులు ఇస్తూ బాగా వైరల్ అయ్యాడు నాగమణికంఠ. దీంతో టాస్కుల్లో సరిగ్గా ఆడకపోయినా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అతన్ని ఇంకా హౌస్ లో ఉంచుతున్నారు. అయితే తాజాగా నాగమణికంఠ.. గంగవ్వతో మాట్లాడుతూ.. ఈ వారం నామినేషన్స్ నుంచి నేను సేవ్ అయితే నీకు బంగారు ముక్కుపుడక కొనిస్తాను. సేవ్ అయిన ప్రతివారం అరతులం బంగారం ఇస్తాను అని అన్నాడు. అయితే గంగవ్వ నువ్వు ఇంకా రెండు వారాలే ఉంటావు, నువ్వు ఉండవు అని మణికంఠను ఆటపట్టించింది.

Also Read : Vishnupriya : అమ్మానాన్న చిన్నప్పుడే విడిపోయారు.. అమ్మ చనిపోయాక.. బిగ్ బాస్ లో విష్ణుప్రియ ఎమోషనల్..

గంగవ్వకు బంగారం ఆఫర్ చేయడంతో హరితేజ నాకు బంగారు వడ్డాణం కావాలి అంటే బేగంబజార్ కి వెళ్లి డూప్లికేట్ కొనిస్తాను అని చెప్పాడు మణికంఠ. ఇక రోహిణి కూడా నాకేమి ఇస్తావు అని అడగడంతో.. నేను సేవ్ అయితే నీకు ఒక ముద్దు ఇస్తాను అని చెప్పడంతో రోహిణి మొదట ఖంగుతిని, నువ్వు సేవ్ అయితే నాకు ఎందుకు ముద్దు అని అంది. దీంతో ఆడియన్స్ నాగమణికంఠ హౌస్ లోపల బాగానే ప్లాన్ చేసుకుంటున్నాడు గా, అందర్నీ కాకాపడుతున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు.