Naga Shaurya: ఫిబ్రవరి 6న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ నుండి అనౌన్స్‌మెంట్.. అదేనా..?
టాలీవుడ్ యంగ్ నాగశౌర్య నటించే సినిమాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుంది. ఈ హీరో తెరకెక్కించే సినిమాల్లో అన్ని వర్గాల ఆడియెన్స్‌ను కనెక్ట్ చేసే అంశాలు ఉంటాయని అభిమానులు భావిస్తారు. అందుకే నాగశౌర్య సినిమాలకు మినిమం గ్యారెంటీ అనే ముద్ర పడింది. అయితే ఇటీవల నాగశౌర్య నటించే సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నా, కమర్షియల్‌గా మాత్రం అనుకున్న మేర విజయాన్ని అందుకోలేకపోతున్నాయి.
Naga Shaurya: టాలీవుడ్ యంగ్ నాగశౌర్య నటించే సినిమాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుంది. ఈ హీరో తెరకెక్కించే సినిమాల్లో అన్ని వర్గాల ఆడియెన్స్‌ను కనెక్ట్ చేసే అంశాలు ఉంటాయని అభిమానులు భావిస్తారు. అందుకే నాగశౌర్య సినిమాలకు మినిమం గ్యారెంటీ అనే ముద్ర పడింది. అయితే ఇటీవల నాగశౌర్య నటించే సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నా, కమర్షియల్‌గా మాత్రం అనుకున్న మేర విజయాన్ని అందుకోలేకపోతున్నాయి.
Naga Shaurya: నాగశౌర్య నెక్ట్స్ మూవీలో కన్నడ సూపర్ స్టార్.. ఎవరంటే..?
ఇక ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీనివాస్ అవసరాల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఓ అదిరిపోయే అనౌన్స్‌మెంట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
Naga Shaurya : ఘనంగా హీరో నాగశౌర్య పెళ్లి
ఈ అనౌన్స్‌మెంట్‌ను ఫిబ్రవరి 6న ఉదయం 11 గంటలకు ఇవ్వబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ఈ అనౌన్స్‌మెంట్ ఏమై ఉంటుందా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసే అవకాశం ఉందని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ మాళవికా మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Our Phalana Abbayi
Phalana Ammayi
have an exciting announcement on 6️⃣th Feb at 1️⃣1️⃣ AM❤?Stay Tuned⏳️#PAPA@IamNagashaurya @iamMalavikaNair#SrinivasAvasarala @vishwaprasadtg@vivekkuchibotla @PSrividya53 pic.twitter.com/83sBLVcO5s
— People Media Factory (@peoplemediafcy) February 4, 2023