Naga Shaurya YuktiThareja Rangabali Trailer released
Rangabali Trailer : నాగశౌర్య (Naga Shaurya) గత ఏడాది ‘కృష్ణ వ్రింద విహారి’ వంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ ఏడాది ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమాతో వచ్చినప్పటికి.. ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయాడు. దీంతో వెంటనే తన కొత్త సినిమాని రిలీజ్ కి సిద్ధం చేసేశాడు. ఈసారి లవ్ అండ్ రొమాంటిక్ కథ కాకుండా.. మాస్ కమర్షియల్ కథని ఎంచుకున్నాడు. రంగబలి అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ లో సినిమా పై ఆసక్తిని కలగజేసింది.
తాజాగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే సినిమాని యాక్షన్ అండ్ కామెడీతో బ్యాలన్స్ చేస్తూ దర్శకుడు సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తుంది. మూవీలో కమెడియన్ సత్య మరియు హీరో మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేయనున్నాయని తెలుస్తుంది. బయట ఊరిలో ఎలా ఉన్నా పర్వాలేదు. సొంత ఊరిలో మాత్రం సింహంలా ఉండాలనే ఆలోచన ఉన్న హీరో.. ఆ ఊరిలోని విలన్ ని ఎలా ఎదురుకున్నాడు అనేదే సినిమా కథని తెలుస్తుంది. ట్రైలర్ అయితే ఆకట్టుకునేలా ఉంది.
కాగా ఈ సినిమాని.. నాని ‘దసరా’ని తెరకెక్కించిన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంస్థ నిర్మిస్తుంది. అంతేకాదు దసరా సినిమాలో విలన్ గా చేసిన ‘షైన్ టామ్ చాకో’ ఈ మూవీలో కూడా ప్రతినాయకుడు పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు పవన్ బసంశెట్టి డైరెక్ట్ చేస్తున్నాడు. పవన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్ లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాడు. జులై 7న ఈ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు.