Rajat Bedi : హృతిక్ క్రిష్ 1 తీవ్రంగా నిరాశపరిచింది.. అందుకే సినిమా పరిశ్రమ నుంచి వెళ్ళిపోయా.. రజత్ బేడీ!

హృతిక్ క్రిష్ 1 సినిమాలో విలన్ గా కనిపించిన రజత్ బేడీ.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బి-టౌన్ లో హాట్ టాపిక్ గా మారాయి.

Rajat Bedi : హృతిక్ క్రిష్ 1 తీవ్రంగా నిరాశపరిచింది.. అందుకే సినిమా పరిశ్రమ నుంచి వెళ్ళిపోయా.. రజత్ బేడీ!

Rajat Bedi viral comments on Hrithik Roshan Koi Mil Gaya

Updated On : June 27, 2023 / 5:16 PM IST

Rajat Bedi – Hrithik Roshan : బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ హీరోగా అతని తండ్రి రాకేష్ రోషన్ దర్శకుడిగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ సినిమా ‘కోయి మిల్ గయా’ (Koi Mil Gaya). క్రిష్ సూపర్ హీరో సిరీస్ లో ఇదే మొదటి చిత్రం. ఈ మూవీకి కొనసాగింపుగా క్రిష్, క్రిష్ 3 సినిమాలు వచ్చాయి. క్రిష్ 1 అంటే కోయి మిల్ గయా సినిమా.. హృతిక్ అండ్ ప్రీతి జింటా కలయికలో తెరకెక్కింది. 2003 లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు రజత్ బేడీ ప్రతినాయకుడు పాత్రలో కనిపించాడు.

RGV Vyooham : వ్యూహం మూవీ నుంచి చిరు, పవన్ లుక్స్‌ని షేర్ చేసిన ఆర్జీవీ..

తాజాగా ఈ నటుడు కోయి మిల్ గయా మూవీ పై చేసిన కామెంట్స్ బి-టౌన్ లో హాట్ టాపిక్ గా మారాయి. గత కొన్నాళ్లుగా సినిమాల్లో కనిపించకపోవడానికి గల కారణాన్ని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. కోయి మిల్ గయా సినిమాలో రజత్ బేడీ పాత్ర హీరోహీరోయిన్లతో సమానంగా ఉంటుంది. అయితే ఫైనల్ ఎడిట్ లో రజత్ బేడీ పాత్రకు కత్తెర్లు పడ్డాయి. ప్రీతి అండ్ రజత్ మధ్య చాలా సన్నివేశాలను మూవీ టీం కట్ చేసేసిందట. ఆ సినిమా కోసం తాను చాలా కష్టపడినట్లు కానీ ఫైనల్ గా తన పాత్రకు ప్రాధాన్యత లేకుండా పోయిందని నిరాశ చెడినట్లు చెప్పుకొచ్చాడు.

Bro Movie : పవన్ ‘బ్రో’ అప్డేట్.. త్వరలోనే టీజర్.. లుంగీ కట్టిన మామాఅల్లుళ్ళు..

అయితే తాను సినిమాలు నుంచి వైదొలగడానికి కారణం ఒక కోయి మిల్ గయా కాదు. మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయని తెలియజేశాడు. “సన్నీ డియోల్‌తో కలిసి ఒక సినిమా చేస్తే.. ఆ మూవీకి నా రెమ్యూనరేషన్ చెక్ రూపంలో ఇచ్చారు. ఆ చెక్ లు బౌన్స్ అయ్యాయి. ఇలాంటివి చూసిన నేను నన్ను నేను ప్రశ్నించుకున్నా.. నా స్నేహితులు 2000 కోట్ల విలువైన కంపెనీలను నడుపుతున్నారు. కానీ నేను ఇక్కడ ఏమి చేస్తున్నాను అనిపించింది. పాపులారిటీ వస్తుంది ఒకే, కానీ సంపాదన కూడా ముఖ్యం కదా అనిపించింది” అని వెల్లడించాడు.