Nagababu : వీరనారి శక్తి ఫౌండేషన్ కి ఆరు లక్షలు డొనేషన్ ఇచ్చిన నాగబాబు.. మిలటరీ వాళ్ళతో అనుబంధం..

ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగబాబు మాట్లాడుతూ..

Nagababu : మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ మూవీ ‘ఆపరేషన్ వాలంటైన్’(Operation Valentine) మార్చి 1న తెలుగు, హిందీ భాషలలో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ భారత వైమానిక దళ అధికారి పాత్రలో నటిస్తుండగా.. హీరోయిన్ మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా, రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పుల్వామా అటాక్, దానికి భారతదేశం ఉగ్రవాదులకు సమాధానం ఇచ్చిన రియల్ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రెనైసెన్స్ పిక్చర్స్ సోని పిక్చర్స్ తో కలిపి నిర్మిస్తుంది.

ఇప్పటికే టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పారు. నేడు హైదరాబాద్ JRC కన్వెన్షన్ లో ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రావడంతో అనేకమంది మెగా అభిమానులు వచ్చి సందడి చేశారు. అలాగే ఈ ఈవెంట్ కి నాగబాబు కూడా వచ్చారు.

Also Read : RC 16 Update : రామ్ చరణ్ – బుచ్చిబాబు సాన RC16 సినిమా కాస్ట్ & క్రూ ఇదే..

నాగబాబు ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ.. మా అమ్మా వాళ్ల నాన్న, మా తాతయ్య ఎక్స్ మిలిటరీ మ్యాన్, మా అమ్మ వాళ్ళ మేనమామ మిలిటరీలో పనిచేసి వార్ లో చనిపోయారు, మా పెదనాన్న మిలటరీలో పనిచేసారు అంటూ తనకి మిలటరీతో ఉన్న అనుబంధాన్ని తెలిపారు. అలాగే ఇండియన్ ఆర్మీ గురించి కొన్ని విషయాలని పంచుకున్నారు. చివర్లో.. నా తల్లి నా పుట్టినరోజుకి కొంత డబ్బు ఇచ్చింది, దానికి ఇంకొంత కలిపి ఆరు లక్షల రూపాయలు మీకు ఇస్తాను. అవి వీరనారి శక్తి ఫౌండేషన్ (ఇండియన్ డిఫెన్స్ లో చనిపోయిన భార్యలకు ఇచ్చే అమౌంట్) కి ఇవ్వండి అంటూ మూవీ యూనిట్ ని కోరారు.

అలాగే వరుణ్ తేజ్ గురించి మాట్లాడుతూ.. వరుణ్ బాధగా ఉన్న సమయంలో ఏమి మాట్లాడడు, నాకు చెప్పడు. ధైర్యం ఇద్దామని వెళ్తే ఏం లేదు బానే ఉన్నాను అంటాడు. ఇంక మాట్లాడటానికి ఏం ఉండదు. కొత్త కొత్త స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటాడు. లవ్ యు వరుణ్ బాబు. జయాపజయాలకు అతీతంగా ఇలాగె మంచి కథలతో వెళ్ళు అని అన్నారు. అలాగే జనసేన, పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఏలియన్స్ కి ఓట్ వేయండి అంటూ కోరారు.

 

ట్రెండింగ్ వార్తలు