RC 16 Update : రామ్ చరణ్ – బుచ్చిబాబు సాన RC16 సినిమా కాస్ట్ & క్రూ ఇదే..

దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా RC16 గ్రాండ్ గా తెరకెక్కుతుంది.

RC 16 Update : రామ్ చరణ్ – బుచ్చిబాబు సాన RC16 సినిమా కాస్ట్ & క్రూ ఇదే..

Ram Charan Buchi Babu Sana RC 16 Movie Update

Updated On : February 25, 2024 / 5:13 PM IST

RC 16 Movie Update : రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రకటించి మూడేళ్లు అయినా సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవని అభిమానులు బాధపడుతున్నారు. సెప్టెంబర్ లో గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. గేమ్ ఛేంజర్ ని పక్కన పెడితే ఆ తర్వాత సినిమా RC16 గురించి మాత్రం రెగ్యులర్ గా ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది.

దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా RC16 గ్రాండ్ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయిపోయినట్టు సమాచారం. RC16 సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ తో తీస్తుండటంతో ఆల్రెడీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొత్త నటీనటుల కోసం ఆడిషన్స్ కూడా పెట్టి కొంతమందిని సెలెక్ట్ చేశారు. బుచ్చిబాబు కూడా RC16 అదిరిపోతుంది అంటూ అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. ఇక ఈ సినిమాకి AR రహమాన్ సంగీతం అందిస్తారని కూడా తెలిపారు చిత్రయూనిట్.

Also Read : Allu Ayaan : అల్లు అయాన్ కి రిప్లై ఇచ్చిన షారుఖ్ ఖాన్.. సో స్వీట్ అంటూ బన్నీ..

తాజాగా ఈ సినిమాకి పనిచేసే మరికొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. RC16 సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలు వర్క్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అలాగే ఈ సినిమాలో కన్నడ స్టార్ యాక్టర్ శివరాజ్ కుమార్ ఓ ముఖ్య పాత్ర పోషించబోతున్నట్టు ఆయనే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా కొల్లా అవినాష్ వర్క్ చేయబోతున్నారు. బుచ్చిబాబు ఈ సినిమాని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. గేమ్ ఛేంజర్ లేట్ అవ్వడంతో అభిమానులు నిరాశగా ఉన్నారు. అందుకే ఆ సినిమా షూట్ అవ్వగానే చరణ్ వెంటనే RC16 మొదలుపెడతారని సమాచారం.